AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..ఉన్నట్టుండి తెల్లగా మారిన నదీజలాలు..! చూసి చలించిపోయిన జనాలు.. దేనికి సంకేతం..?

భయాందోళనకు గురైన ప్రజలు అత్యవసర సేవలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక విభాగం ఫేస్‌బుక్ పోస్ట్‌లో విషయాన్ని షేర్‌ చేసింది. పోస్ట్‌ ప్రకారం.. నదిలో ప్రవహిస్తున్న నీరు పూర్తిగా తెల్లగా మారిందని, దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని, వెంటనే 911కి వచ్చిన కాల్‌కు సిబ్బంది స్పందించారని చెప్పారు. దాంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్టుగా చెప్పారు.

బాబోయ్..ఉన్నట్టుండి తెల్లగా మారిన నదీజలాలు..! చూసి చలించిపోయిన జనాలు.. దేనికి సంకేతం..?
Virginia Creek River
Jyothi Gadda
|

Updated on: Feb 09, 2024 | 9:08 AM

Share

సాధారణంగా నదులలో నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. కొన్ని నదుల్లో నీరు బురదతో కూడి ఉంటుంది. కానీ, బహుశా మీరు తెల్లటి రంగులో కనిపించే నదిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఇటీవల, వర్జీనియాలోని ఒక చిన్న నదిలో అకస్మాత్తుగా తెల్లటి రంగు నీరు ప్రవహించడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. భయాందోళనకు గురైన ప్రజలు అత్యవసర సేవలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. లించ్‌బర్గ్ అగ్నిమాపక విభాగం ఫేస్‌బుక్ పోస్ట్‌లో విషయాన్ని షేర్‌ చేసింది. పోస్ట్‌ ప్రకారం.. హెండ్రిక్స్ స్ట్రీట్ సమీపంలోని నది పూర్తిగా తెల్లగా మారిందని, దానితో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, వెంటనే 911కి వచ్చిన కాల్‌కు సిబ్బంది స్పందించారని చెప్పారు. దాంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్టుగా చెప్పారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది విచారణ అనంతరం మాట్లాడుతూ నది ఉన్నట్టుండి తెల్లగా మారడానికి డ్రెయిన్ మూసుకుపోవడమే కారణమని చెప్పారు. వెస్ట్‌ఓవర్‌ డెయిరీ ప్లాంట్‌ నుంచి వెలువడే పాల వ్యర్థాల వల్ల నీటికి తెల్లటి రంగు వచ్చిందన్నారు. ప్లాంట్‌లోని డ్రెయిన్‌లైన్‌ మూసుకుపోవడంతో మురుగు కాల్వలో నుంచి పాలు పొంగి నదిలోకి వెళ్లాయని ఆ శాఖ తెలిపింది. అనంతరం డ్రెయిన్‌లో పడిన అడ్డంకి క్లియర్ చేయడంతో ఓవర్‌ఫ్లో కూడా ఆగిపోయిందన్నారు.. అలాగే, ఘటనపై స్థానిక, రాష్ట్ర జలవనరుల అధికారులకు సమాచారం అందించారు. నదిలో పారుతున్న పాల వ్యర్థాల వల్ల ప్రజారోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆ శాఖ పేర్కొంది.

గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. 2020 సంవత్సరంలో కొంత కాలం పాటు రష్యాలోని నది రంగు బీట్‌రూట్ లాగా ఎర్రగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇస్కిటిమ్కా అనే నదిలో నీరు ఉన్నట్టుండి ఎర్రగా మారింది. ఈ నది రష్యా దక్షిణ భాగంలో ఉంది. కాలుష్యం కారణంగా ఈ నది రంగు మారిందని అనంతరం తెలిసింది. కెమోరెవో నగర ప్రజలే కాకుండా ఈ నదికి వచ్చే బాతులు, ఇతర జంతువులు కూడా నది రంగు చూసి ఇక్కడికి రావడానికి భయపడటం మొదలుపెట్టాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ