క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం
లక్ష్యాన్ని చేరుకోవాలన్న గట్టి సంకల్పం ముందు సవాళ్లు కూడా చిన్నబోతాయన్న నానుడిని నిజం చేసి చూపించాడో బాలుడు. పశ్చిమబెంగాల్ నదియా జిల్లాకు చెందిన శుభజిత్ బిస్వాస్ పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. కొన్నేళ్ల క్రితం శుభజిత్ కుడిచేతిపై చిన్న కణితి ఏర్పడింది. అది క్యాన్సర్ అని వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం ఎంత డబ్బు ఖర్చుచేసినా ఫలితం లేకపోయింది. చివరకు గత డిసెంబరులో శుభజిత్ కుడిచేతిని తొలగించారు.
లక్ష్యాన్ని చేరుకోవాలన్న గట్టి సంకల్పం ముందు సవాళ్లు కూడా చిన్నబోతాయన్న నానుడిని నిజం చేసి చూపించాడో బాలుడు. పశ్చిమబెంగాల్ నదియా జిల్లాకు చెందిన శుభజిత్ బిస్వాస్ పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. కొన్నేళ్ల క్రితం శుభజిత్ కుడిచేతిపై చిన్న కణితి ఏర్పడింది. అది క్యాన్సర్ అని వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం ఎంత డబ్బు ఖర్చుచేసినా ఫలితం లేకపోయింది. చివరకు గత డిసెంబరులో శుభజిత్ కుడిచేతిని తొలగించారు. ఆ కుటుంబ ఆర్థికపరిస్థితి మరింత క్షీణించింది. అయినా అతడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఫిబ్రవరి మొదటివారం నుంచి జరిగే పదో తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఎడమచేతితో రాయడం సాధన చేసి, ఎవరి సాయం లేకుండా ఇపుడు పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తూ ఔరా అనిపిస్తున్నాడు. శుభజిత్ పట్టుదల, కృషిని ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Srisailam: శ్రీశైలం మహా కుంభాభిషేకం డేట్ ఫిక్స్.. ముమ్మర జరుగుతున్న ఏర్పాట్లు
తెలంగాణలో ఉచిత కరెంట్ పొందాలంటే అది తప్పనిసరి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

