ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్ పాండే పేరును కేంద్రం పరిశిలిస్తోందన్న వార్తలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పందించింది. పూనమ్ పాండే పేరు తమ పరిశీలనలో లేదని బుధవారం స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పూనమ్ పాండే, ఆమె టీం చర్చలు జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది
సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్ పాండే పేరును కేంద్రం పరిశిలిస్తోందన్న వార్తలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పందించింది. పూనమ్ పాండే పేరు తమ పరిశీలనలో లేదని బుధవారం స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పూనమ్ పాండే, ఆమె టీం చర్చలు జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సరవైకల్ క్యాన్సర్‌పై ప్రచార కార్యక్రమం చేపడుతోందని, దీనికి పూనమ్ పాండే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇటీవల పూనమ్ పాండే క్యాన్సర్‌తో మరణించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ వెంటనే తాను బ్రతికే ఉన్నానంటూ ఆ మరుసటి రోజే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు పూనమ్ పాండే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Srisailam: శ్రీశైలం మహా కుంభాభిషేకం డేట్ ఫిక్స్.. ముమ్మర జరుగుతున్న ఏర్పాట్లు
తెలంగాణలో ఉచిత కరెంట్ పొందాలంటే అది తప్పనిసరి
వాహనాల నెంబర్ ప్లేట్స్‌ను TS నుంచి TGగా మార్పు
Mumbai: ముంబై తీరంలో అనుమానాస్పద పడవ కలకలం.
గడ్డ కట్టేసిన సముద్రం.. ఊపిరాడక అల్లాడిపోతున్న తిమింగలాలు