గడ్డ కట్టేసిన సముద్రం.. ఊపిరాడక అల్లాడిపోతున్న తిమింగలాలు
జపాన్‌లో భారీ హిమపాతం కిల్లర్ వేల్స్‌కు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్‌లో హక్కైడో తీరంలోని రౌస్ అనే ప్రదేశానికి కిలోమీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్ వేల్స్ చిక్కుకుపోయాయి. ఇవి కదలడానికి చోటు లేకపోవడంతో.. తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకొంటున్నాయి. హృదయవిదారక దృశ్యాలను జపాన్‌కు చెందిన జాతీయ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది.
జపాన్‌లో భారీ హిమపాతం కిల్లర్ వేల్స్‌కు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్‌లో హక్కైడో తీరంలోని రౌస్ అనే ప్రదేశానికి కిలోమీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్ వేల్స్ చిక్కుకుపోయాయి. ఇవి కదలడానికి చోటు లేకపోవడంతో.. తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకొంటున్నాయి. హృదయవిదారక దృశ్యాలను జపాన్‌కు చెందిన జాతీయ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. మూగజీవాలు గాలి ఆడక అవస్థ పడుతున్న తీరు చూసి జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. కిల్లర్ వేల్స్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఏటా రౌస్‌కు భారీ సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. ముందుగా ఈ దృశ్యాలను చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్కాస్‌ను రక్షించేందుకు అక్కడకు చేరుకోవడం కోస్టుగార్డ్‌కు సవాలుగా మారింది. అక్కడి నీరు మొత్తం మందపాటి మంచుఫలకంలా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP9 ET: RRR రికార్డును బ్రేక్ చేసిన యానిమల్ | పవన్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ తగలబడిపోయిన థియేటర్..