Telangana: ఎండలు షురూ.. నాలుగు నెలలు బాదుడే బాదుడు.! వింటర్‌లోనే ఠారెత్తిస్తున్న సూర్యుడు
తెలంగాణలో అప్పుడే భానుడి భగభగలు మొదలయ్యాయి. వింటర్ సీజన్ పూర్తిగా పోకుండానే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఫిబ్రవరి ఆరంభంలోనే నగరంలో ఎండ సెగ మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం గరిష్ఠంగా హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో 36.3 డిగ్రీలు నమోదైంది. సరూర్‌నగర్‌లోనూ 36.3, బాలానగర్ 35.9, బేగంపేటలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో అప్పుడే భానుడి భగభగలు మొదలయ్యాయి. వింటర్ సీజన్ పూర్తిగా పోకుండానే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఫిబ్రవరి ఆరంభంలోనే నగరంలో ఎండ సెగ మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం గరిష్ఠంగా హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో 36.3 డిగ్రీలు నమోదైంది. సరూర్‌నగర్‌లోనూ 36.3, బాలానగర్ 35.9, బేగంపేటలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. రెండురోజుల క్రితం వరకు 16 నుంచి 17డిగ్రీల వరకుంటే.. ఇప్పుడు 21.2గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి ఎండలు ఎక్కువే ఉంటాయనే సంకేతాలు ఆ శాఖ నుంచి వెలువడుతున్నాయి.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో పగలూరాత్రి ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏసీలూ వాడటం ప్రారంభించారు. పగటిపూట 3,100 మెగావాట్ల వరకు డిమాండ్ ఉంటే రాత్రి 9 గంటలకు 2,697 మెగావవాట్ల మేర నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో రాత్రిపూట 2,287 మెగావాట్లే డిమాండ్ ఉంది. IMD సూచనల ప్రకారం రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

