Karnataka: కృష్ణా నదిలో అయోధ్య బాలరాముని పోలిన విష్ణువు.! బయటపడ్డ పురాతన విగ్రహం
కర్ణాటకలోని కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయటపడింది. రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో నదిలో బయటపడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం ఆశ్చర్యపరుస్తోంది. విగ్రహం చుట్టూ దశావతారాలు కనిపించాయి. విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయటపడింది.
కర్ణాటకలోని కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయటపడింది. రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో నదిలో బయటపడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం ఆశ్చర్యపరుస్తోంది. విగ్రహం చుట్టూ దశావతారాలు కనిపించాయి. విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయటపడింది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్. ఈ విష్ణువు విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలను అందంగా మలిచారనీ అన్నారు. ఈ శ్రీమహా విష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడుడు లేడు. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపించాయి
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

