ఖరీదైన మా రోలెక్స్ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన
లండన్‌లో తాజాగా వాచ్ దొంగతనాలు మితిమీరిపోయాయి. వ్యాపార అవసరాల కోసం లండన్‌కు వచ్చినప్పుడు తమ వద్ద ఉండే ఖరీదైన వస్తువులు దొంగతనానికి గురవుతున్నట్లు భారత సీఈవోలు ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ఇటీవల లండన్‌లో పర్యటించిన భారతీయ సీఈవోలలో చాలామంది దోపిడీకి గురయ్యారనీ అన్నారు. వారివద్ద ఉండే లగ్జరీ వాచ్‌లు, ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయనీ దీనిపై లండన్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లండన్‌లో తాజాగా వాచ్ దొంగతనాలు మితిమీరిపోయాయి. వ్యాపార అవసరాల కోసం లండన్‌కు వచ్చినప్పుడు తమ వద్ద ఉండే ఖరీదైన వస్తువులు దొంగతనానికి గురవుతున్నట్లు భారత సీఈవోలు ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ఇటీవల లండన్‌లో పర్యటించిన భారతీయ సీఈవోలలో చాలామంది దోపిడీకి గురయ్యారనీ అన్నారు. వారివద్ద ఉండే లగ్జరీ వాచ్‌లు, ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయనీ దీనిపై లండన్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. తమకు సౌకర్యంగా లేని ప్రాంతానికి ఎందుకు వెళ్లాలనీ ఈ విషయమై బ్రిటన్ ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియజేశామని అన్నారు. ఈ సందర్భంగా భారత్‌లోని పలు కంపెనీల సీఈవోలు బ్రిటన్ షాడో విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో సమావేశమైనట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఈ భేటీలో లండన్‌లో జరుగుతున్న వాచ్ దొంగతనాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం
ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Srisailam: శ్రీశైలం మహా కుంభాభిషేకం డేట్ ఫిక్స్.. ముమ్మర జరుగుతున్న ఏర్పాట్లు