Hyderabad: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలక్ట్ కాలేదని మనస్థాపం.. పాపం ఇంజనీరింగ్ విద్యార్థి..
తెలంగాణలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 22 ఏళ్ల ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి క్యాంపస్ ప్లేస్‌మెంట్ సమయంలో ఉద్యోగం సాధించడంలోని సవాళ్లను ఎదుర్కొని ఆత్మహత్యకు చేసుకున్నారు. క్యాంపస్ ఇంటర్వూలలో ఎంపిక కాకపోవడంతో, MD మహ్మద్ అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు.

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మహ్మద్ మనస్తాపానికి గురయ్యారు. ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలోని సత్యదేవ్ బాయ్స్ హాస్టల్‌లో నివాసం ఉంటూ చదువుకొనసాగిస్తున్నారు. గత వారం, తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను నిర్వహించింది. అయితే మొహమ్మద్ ఈ డ్రైవ్‌లో ఉద్యోగం సాధించలేక పోయారు. బహుశా ఇదే అతన్ని ఇలాంటి చర్యకు పాల్పడడానికి దారితీసింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్ సమయంలో ఉద్యోగం రాకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ గౌరీ ప్రశాంత్ తెలిపారు.
ఆన్-క్యాంపస్ vs ఆఫ్-క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
తెలంగాణలో, విద్యార్థులు సాధారణంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను ఇష్టపడతారు. ఎందుకంటే ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌లతో పోలిస్తే ఆన్ క్యాంపస్‌లో ఉద్యోగాలను పొందడం చాలా సులభం అని భావిస్తారు. ఆన్-క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో, కంపెనీలు నేరుగా కళాశాల నుండి విద్యార్థులను రిక్రూట్ చేస్తాయి. అయితే ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహించినప్పుడు వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. అప్పుడు పోటీ పెరిగిపోతుంది. దీంతో ఉద్యోగం పొందడం కష్టం అవుతుంది. మహ్మద్ ఆన్- క్యాంపస్ ఉద్యోగాన్నే సాధించలేకపోయిన నేపథ్యంలో ఆఫ్ క్యాంపస్ ఎలా సాధిస్తానన్న మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అర్థమవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..