Telangana: వేసవికాలం ప్రారంభంలోనే తెలంగాణకు వర్ష సూచన.. ఈ ప్రాంతాల వారికి ఉపశమనం..
తెలంగాణలో ఫిబ్రవరి 10 లేదా 11న అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వేసవిలో ఉష్ణోగ్రతలు ప్రారంభమైయ్యాయి. నిన్న, మొన్నటి వరకు ఎముకలు కొరికే చలితో ప్రజలు ఇబ్బందిపడ్డారు. అయితే ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఉక్కపోత ప్రారంభమైంది. గత నెల ఫ్యాన్ వేసుకోవడానికి ఇష్టపడని వారు ఏసీల కోసం, చల్లని వాతావరణం కోరుకుంటున్నారు.

తెలంగాణలో ఫిబ్రవరి 10 లేదా 11న అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వేసవిలో ఉష్ణోగ్రతలు ప్రారంభమైయ్యాయి. నిన్న, మొన్నటి వరకు ఎముకలు కొరికే చలితో ప్రజలు ఇబ్బందిపడ్డారు. అయితే ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఉక్కపోత ప్రారంభమైంది. గత నెల ఫ్యాన్ వేసుకోవడానికి ఇష్టపడని వారు ఏసీల కోసం, చల్లని వాతావరణం కోరుకుంటున్నారు. అయితే ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు తొలకరి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న తెలంగాణలోని సూర్యాపేటలో 38.4 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత చేరుకుంది. దీంతో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పెరిగాయి. మారేడ్‌పల్లిలో 37.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని గోల్కొండ, నాంపల్లి, చార్మినార్ వంటి ప్రదేశాల్లో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. తెలంగాణలో శని లేదా ఆదివారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 10-11 మధ్య ఉత్తర తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాబోయే 5-6 రోజులలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ వర్ష సూచనతో ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి కాస్త ఉపశమనం లభిస్తుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. చలి ప్రభావం ఉదయం పూట కాస్త ఉంటుందని చెబుతున్నారు. ఫిబ్రవరి 16 నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని, ఆ తర్వాత క్రమంగా రెండు, మూడు డిగ్రీల ప్రకారం పెరుగుతూనే ఉంటాయని వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




