Hyderabad: ఫార్ములా ఈ-రేసింగ్ వ్యవహారంపై ప్రభుత్వానికి IAS అరవింద్ కుమార్ రిప్లై
అనుమతి లేకుండా రూ.54 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులను ఫార్ములా-ఈ రేసుకు బదిలీ చేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు రేవంత్ సర్కార్ మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఆయన తొమ్మిది ప్రశ్నలతో కూడిన వివరణ లేఖను ప్రభుత్వానికి పంపారు. ఈ-రేసుల నిర్వహణ ఒప్పందానికి సంబంధించి పూర్తి బాధ్యత అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌దేనని వెల్లడించారు.
ఫార్ములా ఈ-రేసింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు.. రెవెన్యూ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్. మొత్తం 9 ప్రశ్నలకు తన రిపోర్ట్‌లో సమాధానం ఇచ్చారు అరవింద్ కుమార్. సీజన్-9, 10 రేసింగ్‌లు నిర్వహించేందుకు.. జనవరి-2022లో FEOతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఒప్పందానికి పూర్తి బాధ్యత నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌దేనని తన రిప్లైలో స్పష్టం చేశారు.. అరవింద్ కుమార్.
2023, ఫిబ్రవరి 10,11 తేదీల్లో సీజన్-9 రేసింగ్ నిర్వహించామని వివరించారు..అరవింద్ కుమార్. సీజన్-10 హోస్ట్ సిటీగా హైదరాబాద్‌ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారని..అయితే ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో.. HMDA బాధ్యత తీసుకోవాలని చెప్పారని అరవింద్ కుమార్ వివరించారు.
హోస్ట్‌సిటీ కోసం రెండు విడతల్లో రూ.53 కోట్లు చెల్లింపులు జరిగినట్టు తన వివరణలో చెప్పారు. తొలి విడతలో 45 కోట్లు చెల్లించగా..పన్నుల రూపంలో మరో 8 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో చెల్లింపులు జరిగాయన్నారు అరవింద్ కుమార్.
ఫార్ములా ఈ-రేసింగ్‌కు సంబంధించిన ప్రతి నిర్ణయం కేటీఆర్‌దేనని.. కేటీఆర్ ఆదేశాలతోనే సెప్టెంబర్ 25, 2023లో FEOతో సీజన్ 10 కు ఒప్పందం చేసుకున్నామని రిప్లై ఇచ్చారు అరవింద్ కుమార్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..