Viral: చెక్‌పోస్ట్ వద్ద పోలీసులను చూసి ఆగిన ఇన్నోవా కారు.. డ్రైవర్ పరుగో పరుగు.. చెక్ చేయగా
మహారాష్ట్రలో నకిలీ నోట్లను ముద్ర చేసే ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతోనే పోలీసులు ప్లాన్ వేసి మరీ.. ఈ ముఠా బాగోతం బయటపడింది. ఆ వివరాలు ఏంటో.? ఈ స్టోరీలో చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా మీరజ్‌లో నకిలీ నోట్లు ముద్రించే గ్యాంగ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఒక కోటికి పైగా విలువైన నకిలీ నోట్లు స్వాధీనం కాగా.. పోలీసు హవల్దార్ సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మహాత్మా గాంధీ చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మిరజ్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఒక ఇనోవా కారు సహా రూ.1.11 కోట్ల విలువైన సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
నిందితులైన ఇబ్రార్ ఆదమ్ ఇనామ్దార్(44), సుప్రీత్ కహాన్యా దేశాయ్(22), రాహుల్ రాజారాం జాధవ్(33), నరేంద్ర జగన్నాథ్ శిండే(40), సిద్ధేశ్ జగదీశ్ మ్హాత్రే(28) కొల్హాపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ రూ. 500, రూ. 200 నామినేషన్‌లలో నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్లో ప్రవేశపెట్టే ప్లాన్‌తో మీరజ్‌కి వచ్చినట్లు తెలిసింది. అయితే, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఒక నిందితుడిని రంగే హస్తం పట్టుకున్నారు. అతని విచారణలోనే మొత్తం గ్యాంగ్ కార్యకలాపాలు బహిర్గతమయ్యాయి.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా








