TSPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు రూట్ క్లియర్.. వయోపరిమితి పెంపు..
ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గ్రూప్ -1 ఎగ్జామ్ రాసేందుకు తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ సర్కారు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. గతంలో లీకేజీ, కోర్టు కేసులతో రెండు సార్లు రాసిన పరీక్ష రద్దు కాగా బోర్డు ప్రక్షాళన, పోస్టుల సంఖ్య పెంపుతో రేవంత్ సర్కారు నయా నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం చేసింది.
ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గ్రూప్ -1 ఎగ్జామ్ రాసేందుకు తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ సర్కారు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. గతంలో లీకేజీ, కోర్టు కేసులతో రెండు సార్లు రాసిన పరీక్ష రద్దు కాగా బోర్డు ప్రక్షాళన, పోస్టుల సంఖ్య పెంపుతో రేవంత్ సర్కారు నయా నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాక నోటిఫికేషన్లు ఇవ్వాలని భావించింది. అందుకు అనుగుణంగా బోర్డు చైర్మన్, సభ్యుల రాజీనామా తర్వాత బోర్డు కొత్త చైర్మన్‌గా మహేందర్ రెడ్డి సహా సభ్యుల బాధ్యతలు స్వీకరణ పూర్తైంది.
తొలి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉన్న అడ్డంకులను ఒక్కొక్కొటిగా తొలగించుకుంటూ కమిషన్ ముందుకు వచ్చింది. గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇవ్వాలని అందుకు గతంలో ఉన్న 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను యాడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రెష్ గా 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల రెండు రోజుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి రెండేళ్ల క్రితం గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది. 2022 అక్టోబర్ 16 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా.. దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. కానీ గతేడాది పేపర్ లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్ష రద్దు అయింది. తర్వాత గతేడాది జూన్ 11 ఎగ్జామ్ పెట్టగా ఈ సారి బోర్డు నిర్వాకంతో బయోమెట్రిక్ తీసుకోలేదన్న కారణాలతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది.
దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆనాటి పిటిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకి మారడంతో ప్రస్తుత బోర్డు దాన్ని విత్ డ్రా చేసుకుంది. దీంతో నయా నోటిఫికేషన్ రూట్ క్లియర్ అయింది. కొత్తగా నోటిఫికేషనే కాదు నిరుద్యోగులకు సర్కారు మరో తీపి కబురు కూడా చెప్పింది. పోస్టుల సంఖ్యను మరో 60 పెంచడంతో పాటు అభ్యర్థుల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాల వయోపరిమితి పెంచుతూ పాత నిబంధనను సడలిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ప్రకటన చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ కొత్తగా విడుదల చేసే గ్రూప్ -1 నోటిఫికేషన్లో ఎలాంటి రిలీఫ్స్ ఉంటాయని నిరుద్యోగులు మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు వీలులేకుండా గ్రూప్1 ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుకుంటున్నారు అభ్యర్థులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..