Hyderabad: సింగోటం రాము మర్డర్ కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు
-- సింగోటం రాము హత్యకేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. రాము హత్యకు కారకులైన హిమాంబి, ఆమె కూతురు అరాచకాలను ఒక్కొక్కటిగా బయటడుతున్నారు. ఇప్పటికే హిమాంబిపై 5 కేసులు ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు.
సింగోటం రాము మర్డర్ కేసులో టిస్ట్‌ల మీద ట్విస్ట్‌లు తెరపైకి వస్తున్నాయి. జల్సాలకు అలవాటు పడి హిమాంబి, ఆమె కూతురు.. ఇల్లీగల్ దందాకు సంబంధించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పలు పోలీస్‌స్టేషన్‌లలో తల్లి హిమాంబిపై 5 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. 2017, 2018లో ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడింది హిమాంబి.. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేసి 3 లక్షలు స్వాహా చేసినట్లు కేసులు ఉన్నాయి. అంతేకాకుండా 2020లోనూ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం కేసులో హిమాంబిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2019లో కూతురు నసీమాను కిడ్నాప్ చేశారని రాజు అనేవ్యక్తిపై తప్పుడు కేసు పెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కూతురుతోపాటు ఇతర అమ్మాయిలతో హిమాంబి వ్యభిచారం చేయిస్తున్నట్లు తేల్చారు.
జూబ్లీహిల్స్ హనీట్రాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రియల్‌ఎస్టేట్ వ్యాపారి పుట్టరాము అలియాస్ సింగోటం రాము హత్యకేసులో.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. రాముతో వ్యవహారం, రామును ట్రాప్ చేసిన తీరు, రాము హత్య… అంతా ఓ క్రైమ్ కథా చిత్రాన్ని తలపిస్తుంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ.. రౌడీషీటర్లు, ప్రియుడితో కలిసి రామును అంతమొందించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన హిమాంబి, భర్తను వదిలేసి కూతురుతో సహా హైదరాబాద్‌కు మాకాం మార్చింది. యూసుఫ్‌గూడలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో దిగి ప్రేమాయణం సాగించి చివరకు ఆయనను బయటకు గెంటేసింది. అలా మొదలెన ఆమె వ్యభిచార దందా.. చివరకూ కూతురితో కలిసి బడాబాబులను హనీట్రాప్ చేయడం.. ఉన్నదంతా ఊడ్చేయడం.. ఏదోకటి చేసి దూరం పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో సింగోటం రామన్న అలియాస్ పుట్టా రామును ట్రాప్ చేశారు. అతడి నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. చివరకు అతడిని అప్పుల పాలు చేశారు.
రాము.. హిమాంబి కూతురిపై కన్నైయ్యడంతో.. పక్కా ప్లాన్‌తో రామును అత్యంత కిరాతకంగా హత్య చేయించింది హిమాంబి. రాము హత్యలో రౌడీ షీటర్లు, రాము స్నేహితులు మణికంఠ, వినోద్ ఇన్వాల్వ్ అయ్యారు. వినోద్‌కు హిమాంబి కూతురు నసీమాతో పరిచయం ఏర్పడింది. రాము వేధిస్తున్న విషయం ప్రియుడు వినోద్ తో చెప్పింది నసీమా. ఆగ్రహానికి లోనైన వినోద్ స్నేహితుడు మణికంఠకు విషయం చెప్పాడు. ఎప్పటి నుంచో రాము హత్యకు ప్లాన్ చేస్తున్న మణికంఠ.. నసీమా, హిమాంబి, వినోద్ అందరూ కలిసి ప్లాన్ చేశారు. యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్ నగర్‌లోని హిమాంబి ఇంటికి రాము రప్పించి.. రౌడీషీటర్ జిలానీ గ్యాంగ్‌తో హత్య చేయించారు. రాము బామ్మర్ధికి వీడియో కాల్ చేసి డెడ్ బాడీని తీసుకెళ్లమని చెప్పారు. మణికంఠ, వినోద్, మరికొందరు కలిసి రాంరెడ్డి నగర్‌లోని బార్ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాము హత్యతో ప్రమేయం ఉన్న మణికంఠ, వినోద్, మహ్మద్ ఖైసర్, కావలి శివకుమార్ అలియాస్ బండ శివ, కప్పల నిఖిల్ తో పాటు హత్యకు ప్రోత్సహించిన నసీమా, ఆమె తల్లి హిమాంబి అలియాస్ హసీనాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..