AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లోక్ సభ ఎన్నికలే లక్ష్యం.. గ్రేటర్ హైదరాబాద్‎లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గ్రేటర్‌పై కన్నేసింది. ఇటీవల ఎన్నికల్లో గ్రేటర్‌లో దారుణఫలితాలు రావడంతో.. హైదరాబాద్‌లో పార్టీని పటిష్టం చేసేందుకు తగిన ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‎లోని బలమైన నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌పై ఫోకస్‌ చేసింది.

Telangana: లోక్ సభ ఎన్నికలే లక్ష్యం.. గ్రేటర్ హైదరాబాద్‎లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు
Congress Party
Srikar T
|

Updated on: Feb 12, 2024 | 7:30 AM

Share

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గ్రేటర్‌పై కన్నేసింది. ఇటీవల ఎన్నికల్లో గ్రేటర్‌లో దారుణఫలితాలు రావడంతో.. హైదరాబాద్‌లో పార్టీని పటిష్టం చేసేందుకు తగిన ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‎లోని బలమైన నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌పై ఫోకస్‌ చేసింది. ఎన్నికల నాటికి గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్‌ఎస్‌లో గుర్తింపు దక్కని బలమైన నేతలను కాంగ్రెస్‌లోకి ఆకర్షిస్తోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మల్కాజ్‌గిరి టికెట్‌ ఆశిస్తోన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌ను కలిశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. కృష్ణారెడ్డి బాటలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి చేరే అవకాశం ఉంది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డితోపాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయం తెలుసుకుని ఆయనకు హుటాహుటిన మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన నాడు కాంగ్రెస్‌లో చేరలేదు. తాజాగా మరోమారు ఆయన హస్తం నేతలతో టచ్‌లోకి వెళ్లారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. రెండు వారాల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. దాదాపు గంటపాటు చర్చించారు. ఈ క్రమంలో ఆదివారం ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైంది.

వరుసగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వచ్చి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్తున్నారు. బయటకు మాత్రం కర్టెసీ మీటింగని చెబుతున్నారు. అయితే వీరి వరుస సమావేశాలు రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. పవర్ పాలిటిక్స్‎లో అనుభవం ఉన్న కేసీఆర్‌ తన హయాంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తన పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఓదశలో అయితే విపక్షపార్టీల ఉనికే ప్రశ్నార్థకమైంది. అయితే తర్వాతి పరిణామాల నేపథ్యంలో పరిస్థితులు మారాయి. క్రమంగా బలోపేతమైన కాంగ్రెస్.. ఏకంగా అధికార పార్టీగా అవతరించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‎ను గ్రేటర్ ఆదుకుంది. ఏకంగా 14 సీట్లు ఇక్కడే సాధించింది కారు పార్టీ. 2014 ముందు వరకు కార్పొరేటర్ల వరకే పరిమితమైన గులాబీదళం.. వివిధ పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. టీడీపీని పోరులో లేకుండా చేసేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకుంది. ఇప్పుడు అదే పంథాను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది. తాము చేసిన పనే ఇప్పుడు రేవంత్ సైతం అనుసరిస్తుండడంతో.. కనీసం వాటిని ఖండించే స్థితిలో లేకుండా పోయింది బీఆర్ఎస్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..