Telangana: ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో..
ఆ ఎమ్మెల్యే గెలుపే ఒక సంచలనం. తనను గెలిపిస్తే.. ప్రజల సమస్యల పరిష్కారానికి డోర్ డెలివరీ సర్వీస్ చేస్తానన్న హామీకి శ్రీకారం చుట్టారు. ఈ వినూత్న నిర్ణయంతో నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రెజెంట్ సీఎం రేవంత్‌పై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఆ ఎమ్మెల్యే గెలుపే ఒక సంచలనం. తనను గెలిపిస్తే.. ప్రజల సమస్యల పరిష్కారానికి డోర్ డెలివరీ సర్వీస్ చేస్తానన్న హామీకి శ్రీకారం చుట్టారు. ఈ వినూత్న నిర్ణయంతో నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రెజెంట్ సీఎం రేవంత్‌పై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ సర్వీస్‌లను డోర్ డెలివరీ చేస్తానని వాగ్ధానం చేసిన వెంకటరమణారెడ్డి.. ఆ దిశగా పనులకు శ్రీకారం చుట్టారు.
నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఫిర్యాదు బాక్సును ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే. ఫిర్యాదు బాక్స్‌లో వచ్చిన కంప్లైంట్స్‌ను నేరుగా తానే చూసి.. ఇంటివద్దకు అధికారులను తీసుకొని వచ్చి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఫిర్యాదు బాక్స్‌లను సద్వినియోగం చేసుకోవాలని.. తనను కలిసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాకుండా అమూల్యమైన సమయాన్ని సేవ్ చేసుకోవాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..