AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే

తమ ఊరి గ్రామ శివారులో దేవుడు వెలిశాడంటూ గ్రామస్తులు తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో దొరికిన ఓ రాతికి మీసాల లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి దేవుని రూపాలు ఉండటంతో పూజలు చేశారు. ఇంకా విగ్రహాలు ఉన్నాయనే నమ్మకంతో త్రవ్వకాలు కొనసాగిస్తున్నారు.

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే
Khammam Dist
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 12, 2024 | 11:38 AM

Share

తమ ఊరి గ్రామ శివారులో దేవుడు వెలిశాడంటూ గ్రామస్తులు తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో దొరికిన ఓ రాతికి మీసాల లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి దేవుని రూపాలు ఉండటంతో పూజలు చేశారు. ఇంకా విగ్రహాలు ఉన్నాయనే నమ్మకంతో త్రవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామ సమీపంలో దేవుడు వెలిశాడంటూ గ్రామస్తులు తవ్వకాలు జరిపి ఓ రాయిని వెలికితీసి పూజలు చేశారు. గ్రామానికి చెందిన బుద్ధారపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఒక రోజు రాత్రి వేళ తన పని ముగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొదలో దేవుడు కనిపించినట్లు అనిపించడంతో గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు నమ్మకపోవడంతో తానే స్వయంగా కొంతమంది గ్రామస్తులతో ముక్కోటి ఏకాదశి రోజున కొంత మేర తవ్వకాలు చేపట్టి వదిలివేశారు.

ఆనాటి నుంచి గ్రామంలో జరిగే కొన్ని శుభకార్యాలలో మహిళలకి ఉగ్రరూపంలో ఒంటిపైకి వచ్చి నేను అక్కడే ఉన్నానంటూ నన్ను ఎవరు గుర్తించడం లేదని చెబుతుండటంతో గ్రామస్తులంతా చర్చించుకుని తవ్వకాలు జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గ్రామస్తుడు శ్రీనివాస్‎కు దేవుని రూపంలో కనిపించిన ఆ ప్రదేశంలో గ్రామస్తులు పూజారితో పూజలు నిర్వహించి జేసీబీతో తవ్వకాలు జరిపారు. 12 అడుగుల మేర తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఓ బండరాతికి మీసాల లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి రూపాలు కనిపించాయి. దీంతో పూజారులు వాటికి పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని స్వామి వెలిశాడనే నమ్మకంతో పూజలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతం అంతా పండగ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!