AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు.. కానీ 31 ఏళ్ల వయసులోనే మరణం.. ఈ హీరో ఎలా చనిపోయాడో తెలుసా.. ?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో. కేవలం ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ షేక్ చేశాడు. దీంతో అతడి పేరు సినీరంగంలో మారుమోగింది. వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 31 ఏళ్ల వయసులోనే జీవితానికి ముగింపు పలికాడు. ఇంతకీ ఈ హీరో ఎలా చనిపోయాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Tollywood : ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు.. కానీ 31 ఏళ్ల వయసులోనే మరణం.. ఈ హీరో ఎలా చనిపోయాడో తెలుసా.. ?
Kunal Singh
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2026 | 12:05 PM

Share

1999లో కదిర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుల రోజు’ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పేరుకు తమిళ సినిమానే అయినప్పటికీ, తెలుగులోనూ డబ్ అయిన ఈ ప్రేమకావ్యం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఈ చిత్రంతో సౌత్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు హీరో కునాల్ సింగ్. అప్పట్లో ఈ సినిమా యూత్ ఫేవరేట్ కాగా.. కునాల్ కు సైతం విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ చిత్రంలో అందాల భామ సోనాలి బింద్రే సరసన హీరోగా నటించి యూత్ హృదయాలను కొల్లగొట్టిన కునాల్ సింగ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. కానీ ఆ తర్వాత ఆయన జీవితంలో ఊహించని మలుపులు తిరిగింది. ‘ప్రేమికుల రోజు’ సినిమా తర్వాత కునాల్ కెరీర్ సరిగా ముందుకు సాగలేదు. ఆయన ఎంచుకున్న తర్వాతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో క్రమంగా అవకాశాలు కరువయ్యాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నానా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చేసేది లేక చివరికి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్‌గా కూడా ఆయన పనిచేశారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

కునాల్‌కు భార్య అనురాధ సింగ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా మారారు కానీ ఆ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టడంతో విపరీతమైన అప్పులపాలయ్యారు. మరోవైపు కుటుంబంలోనూ కలహాలు చెలరేగాయి. కెరీర్ కుప్పకూలడం, భార్య దూరమవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో కునాల్ మానసికంగా తీవ్ర కుంగుబాటుకు లోనయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

అన్నివైపుల నుంచి కష్టాలు చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు గురైన కునాల్ సింగ్, 2008 ఫిబ్రవరి 7న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణించే నాటికి కేవలం 31 ఏళ్లు మాత్రమే. ఒకప్పుడు వెండితెరపై అందరినీ అలరించిన హీరో అర్ధాంతరంగా ఇలా తనువు చాలించడం అప్పట్లో సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
అప్పట్లో ట్రెండ్ సృష్టించిన హీరో.. కానీ పర్సనల్ లైఫ్ లో విషాదం..
అప్పట్లో ట్రెండ్ సృష్టించిన హీరో.. కానీ పర్సనల్ లైఫ్ లో విషాదం..
ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం..
ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం..
ధంతేరస్ రోజున ఈ టైమ్‌లో గోల్డ్ కొంటే మంచిది..? మంచి ముహూర్తం ఇదే.
ధంతేరస్ రోజున ఈ టైమ్‌లో గోల్డ్ కొంటే మంచిది..? మంచి ముహూర్తం ఇదే.
ఒక టీచర్.. 5 తరగతులు.. ఒకే గది: మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నదెవరు
ఒక టీచర్.. 5 తరగతులు.. ఒకే గది: మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నదెవరు
రాప్తాడు ఘటన బాధితురాలిని పరామర్శించిన మంత్రి లోకేష్
రాప్తాడు ఘటన బాధితురాలిని పరామర్శించిన మంత్రి లోకేష్
IPL Retention: రూ.14.2 కోట్ల ప్లేయర్‌కు సీఎస్కే గుడ్‌బై..!
IPL Retention: రూ.14.2 కోట్ల ప్లేయర్‌కు సీఎస్కే గుడ్‌బై..!
నాకు క్యాన్సర్ అని తెలియగానే ఆ హీరో 2 లక్షలు పంపించారు..
నాకు క్యాన్సర్ అని తెలియగానే ఆ హీరో 2 లక్షలు పంపించారు..
శరీరానికి, నరాలకు కొండంత బలం.. నెలకు ఒక్కసారైనా తినండి..
శరీరానికి, నరాలకు కొండంత బలం.. నెలకు ఒక్కసారైనా తినండి..
బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..
బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..