CM Revanth reddy: రేవంత్ రెడ్డిని కలిసిన బొంతు రామ్మోహన్.. అదే విషయం గురించి మాట్లాడారా?
ఇదిలా ఉంటే ఉంటే జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల ఇతర పార్టీలకు చెందిన నాయకులు కలవడం చర్చనీయాంశంగా మారుతోన్న విషయం తెలిసిందే. మొన్నటిమొన్న బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కలవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో సమావేశమైనట్లు సదరు నేతలు ప్రకటించడంతో ఆ టాపిక్ అక్కడితో ముగిసిపోయింది.
ఇదిలా ఉంటే ఉంటే జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు భేటీలో పాల్గొన్నారు. బొంతు రామ్మోహన్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..