Secunderabad: అసెంబ్లీలన్నీ గెలిచినా అదొక్కటే లేదు.. అధికారంతో బలపడేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు

అసెంబ్లీలన్నీ చేతిలో ఉన్నా అదొక్కటే రాలేదన్న నిరుత్సాహం ఓ పార్టీకి.. ఆ ఒక్కటి చేతిలో ఉన్నా.. అసెంబ్లీలో సత్తా చాటలేదనే ఫీలింగ్ మరో పార్టీది ! రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ సారి ఎలాగైనా ఆ లోక్‌సభ సీటు గెలవాలనేది అధికార పార్టీ సంకల్పం. ఇలా అన్ని పార్టీల ఫోకస్‌ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభపైనే ఉంది.

Secunderabad: అసెంబ్లీలన్నీ గెలిచినా అదొక్కటే లేదు.. అధికారంతో బలపడేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు
Secunderabad Parliament
Follow us

|

Updated on: Feb 11, 2024 | 8:09 PM

అసెంబ్లీలన్నీ చేతిలో ఉన్నా అదొక్కటే రాలేదన్న నిరుత్సాహం ఓ పార్టీకి.. ఆ ఒక్కటి చేతిలో ఉన్నా.. అసెంబ్లీలో సత్తా చాటలేదనే ఫీలింగ్ మరో పార్టీది ! రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ సారి ఎలాగైనా ఆ లోక్‌సభ సీటు గెలవాలనేది అధికార పార్టీ సంకల్పం. ఇలా అన్ని పార్టీల ఫోకస్‌ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభపైనే ఉంది.

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ జనాలు తీర్పులో ప్రతీసారి తమ విభిన్నత్వాన్ని చాటుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఏక పక్షంగా పట్టం కడితే.. పార్లమెంట్ కి వచ్చేసరికి జాతీయ పార్టీలకు జై కొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌లో ఇప్పటివరకు బీఆర్ఎస్‌ జెండా ఎగరలేదు. 2014, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో రెండు సార్లు సికింద్రాబాద్‌ ఎంపీ సీట్‌ గెలిచిన బీజేపీ.. అసెంబ్లీ స్థానాల్లో జెండా ఎగరేయలేకపోయింది. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో అన్ని స్థానాలను దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన బీఆర్ఎస్‌..పార్లమెంట్‌ను దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ సారి లెక్కలు మార్చి పక్కా వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి రెండు పార్టీలు. ఇరు పార్టీలతో పాటు అధికార కాంగ్రెస్‌ పార్టీ కూడా సికింద్రాబాద్ లోక్‌సభలో గెలుపు కోసం కొత్త ఎత్తులు వేస్తోంది.

తెలంగాణలో బీజేపీకి కంచుకోటగా ఉన్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్‌ 1957లో ఏర్పడింది. ఇక్కడ నుంచి గతంలో బండారు దత్తాత్రేయ మూడుసార్లు విజయం సాధించగా, గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఈ ఇద్దరు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. దీంతో బీజేపీ లీడర్లకు సికింద్రాబాద్‌ హాట్‌సీట్‌గా మారింది. ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు ముఖ్య నేతలంతా పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనూ కమలం పార్టీకి పట్టు ఉంది. అయితే బీజేపీ నుంచి తిరిగిఎంపీగా పోటీ చెయ్యడానికి కిషన్ రెడ్డి సిద్ధమవుతున్నారు…కిషన్ రెడ్డికి సీటు ఖాయం అవ్వడం తో ఆ పార్టీ నుంచి ఇక ఎవరు ప్రయత్నాలు చేయడం లేదు.

కాంగ్రెస్ నుంచి మరోసారి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లేదా అయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్‌ నుంచి అభ్యర్థి విషయంలో క్లారిటీ రావడం లేదు. కిషన్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని బరిలో దించకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందనే అభిప్రాయం గులాబీ పార్టీలో ఉంది. గత ఎన్నికల్లో పోట ఈచేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ ఈసారి కూడా సీటు ఆశిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా ఈసారి బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. సికింద్రాబాద్‌ పార్లమెంట్ రేసులో బీఆర్ఎస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌ పేరు వినిపిస్తోంది…బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.

సికింద్రాబాద్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్.. ఈ ఏడు స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచారు. ఐతే గత రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం గులాబీ దళం సక్సెస్‌ అందుకోలేక పోయింది. ఇటు కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రేటర్ లో గెలవలేక పోవడంతో పాటు కార్పొరేటర్లు కూడా లేరు. అందుకే బీఆర్ఎస్‌ కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకుని బలపడాలని హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అధికారం అనే అయస్కాంతం దగ్గర ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!