ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై ప్రభుత్వం సీరియస్.. డాక్టర్లపై వేటు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒక వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే కొందరు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోగులకు శాపంగా మారుతోంది. ఈ రోజుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సేవలు అందించేలా..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒక వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే కొందరు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోగులకు శాపంగా మారుతోంది. ఈ రోజుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ICU వార్డులో ఉన్న ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘనటలో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వైద్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఐసీయూ విభాగంలోని వైద్యులు కావ్య, వసంత్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్ మంజులపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 11వ తేదీని ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగానే ఇలా జరిగినట్లు పేషెంట్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




