AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Season: ఇంటి ముంగిట పందిళ్లు.. 2లక్షల పెళ్లిళ్లు.. మాఘమాసం సందళ్లు..

మాఘమాసం ఎప్పుడు వస్తుందో అంటూ సినిమా పాట మనం విన్నాం. మొన్ననే పుష్యమాసం వెళ్ళిపోవటంతో మాఘమాసం వచ్చేసింది. మాఘమాసం అంటేనే శుభకార్యాలకు ముఖ్యంగా పెళ్లిళ్లకు మంచి సీజన్. ఇప్పుడు ఆ పెళ్లిళ్ల సందడి ఎక్కడ చూసినా కనిపిస్తోంది. తెలుగు ఉగాది పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 13 మంగళవారం నుండి ఏప్రిల్ 26 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు.

Marriage Season: ఇంటి ముంగిట పందిళ్లు.. 2లక్షల పెళ్లిళ్లు.. మాఘమాసం సందళ్లు..
Marriage Season
Yellender Reddy Ramasagram
| Edited By: Srikar T|

Updated on: Feb 12, 2024 | 1:22 PM

Share

మాఘమాసం ఎప్పుడు వస్తుందో అంటూ సినిమా పాట మనం విన్నాం. మొన్ననే పుష్యమాసం వెళ్ళిపోవటంతో మాఘమాసం వచ్చేసింది. మాఘమాసం అంటేనే శుభకార్యాలకు ముఖ్యంగా పెళ్లిళ్లకు మంచి సీజన్. ఇప్పుడు ఆ పెళ్లిళ్ల సందడి ఎక్కడ చూసినా కనిపిస్తోంది. తెలుగు ఉగాది పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 13 మంగళవారం నుండి ఏప్రిల్ 26 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు అంటున్నారు. ఈ 70 రోజుల్లో పెళ్లిళ్లు, అక్షరాభ్యాసాలు, శుభకార్యాలతో ఏదో ఒక వేడుకతో బంధువులు, స్నేహితులను పిలిచి ఒక పండగ వాతావరణం క్రియేట్ అయ్యేలా చేసేది ఈ ఏడాది మాఘమాసం. పురోహితులు చెప్పిన దాన్నిబట్టి దాదాపు 30 మంచి ముహూర్తాలు ఉన్నాయని తెలుస్తోంది. పెళ్లిళ్లకు వధూవరుల జన్మ నక్షత్రాలు ఆధారంగా మరికొన్ని మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. ఈ సీజన్ మొత్తం దాదాపు రెండు లక్షల వరకు వివాహాలు జరగనున్నట్టు అంచనా.

ప్రతి సంవత్సరం మాఘమాస శుద్ధ పంచమి నాడు అంటే వసంత పంచమి రోజున కొన్ని వేల పెళ్లిళ్లు జరగడం చూస్తూ ఉంటాం. మాఘమాసంలో వచ్చే మంచి ముహూర్తాల్లో బలమైనది వసంత పంచమి. సరస్వతీమాత పుట్టినరోజు కావడంతో చాలా మంది ఈ ముహూర్తానికి శుభకార్యాలు, పెళ్లిళ్లు చేయడానికి రెడీ అవుతుంటారు. కానీ ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 14న రావడం.. అదే రోజు ప్రేమికుల రోజు కావడంతో చాలా జంటలు తమ తల్లిదండ్రులను ఒప్పించి వసంత పంచమి అయిన ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సీజన్ మొత్తంలో దాదాపు రెండు లక్షల వివాహాలు జరిగనున్నట్లు అంచనా.. కానీ ఈ ఫిబ్రవరి 14 వసంత పంచమి రోజున.. అంటే ప్రేమికుల రోజునే దాదాపు 60 వేల పెళ్లిళ్లు గ్రేటర్ నగర పరిధిలో జరుగుతున్నట్టు చెబుతున్నారు ఈవెంట్ నిర్వహకులు. లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్లో తక్కువ ముహూర్తాలు ఉండడంతో టైం సరిపోక చాలా పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మాఘమాసం ఎంటర్ అవడంతో ఈ మాఘమాసంలోనే పెళ్లిళ్లు చేసుకునేందుకు చాలా జంటలు సిద్దమవుతున్నాయి. దీనికోసం మూడు, నాలుగు నెలల ముందుగానే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న నార్సింగ్, కోకాపేట్, ఎల్బీనగర్, చైతన్యపురి, నాగోల్, ఉప్పల్, మియాపూర్, కూకట్‎పల్లి ప్రాంతాల్లోని పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. కొన్నిచోట్ల ఫంక్షన్ హాల్లో రోజువారి అద్దె కూడా డలుల్ అయింది. ఈ 70 రోజులు దాటితే పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండకపోవడంతో.. ఈ సీజన్లోనే శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసేందుకు రెడీ అవుతున్నారు చాలామంది పేరెంట్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..