Telangana News: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు.. ఎట్టకేలకు చేధించిన పోలీసులు!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నూరు SBI బ్రాంచ్ అధికారుల కుంభకోణం కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న బ్యాంక్ క్యాషియర్ రవీందర్ సహా 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 15.237 గ్రాముల కిలోల బంగారు ఆభరణాలు, ఒక లక్ష 61 వేల 730 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

రామగుండంలో తీవ్ర దుమారం రేపిన చెన్నూరు SBI బ్రాంచ్ అధికారుల కుంభకోణం కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న బ్యాంక్ క్యాషియర్ రవీందర్ సహా 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో బ్యాంక్ మేనేజర్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ తో పాటు పలువురు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. నిందితుల నుండి మొత్తం 15.237 గ్రామలు బంగారు ఆభరణాలు, ఒక లక్ష 61 వేల 730 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని మీడియా ముందు హాజరుపర్చారు.
ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ మాట్లాడుతూ.. ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడిన ప్రధాన నిందితుడు రవీందర్, తాను పనిచేస్తున్న SBI లోని 402 గోల్డ్ లోన్ ఖాతాలకు చెందిన 21 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించి వాటిని ప్రైవేటు గోల్డ్ లోన్ కంపెనీలలో తాకట్టు పెట్టినట్లు సీపీ తెలిపారు. ఈ ఆభరణాల తాకట్టకు పెట్టగా వచ్చిన సొమ్మును రవీందర్.. వారి బంధువులైన 60 మందికి పైగా అకౌంట్లకు బదిలీ చేసినట్టు తెలిపారు. తర్వాత అదే డబ్బును అతను బెట్టింగ్ కోసం వినియోగించినట్టు తెలిపారు.
అంతేకాకుండా రవీందర్ మరికొన్ని ఫేక్‌లోన్ అకౌంట్లను కూడా క్రియేట్ చేసి.. సుమారు. 1.58 కోట్లు బ్యాంకు నుండి కాజేసినట్లు గుర్తించారు. నిందితుల నుండి పూర్తిస్థాయి రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్నామని.. బాధితులందరికీ న్యాయం చేసేలా కృషి చేస్తామని సిపి భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును చేధించేందుకు ప్రత్యేక బృందాలను నియమించి.. నిందితులను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




