Telangana: గుడ్ న్యూస్.. ఆ 2 స్టేషన్లలో ఆగనున్న నాగ్‌పూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
నాగ్‌పూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో కొత్త స్టాపులు కల్పించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రయాణికుల డిమాండ్‌తో తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలికంగా అమల్లోకి రానుండగా, అమలు తేదీపై అధికారిక ప్రకటన కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ..

ప్రయాణికులకు గుడ్ న్యూస్. నాగ్‌పూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణలో మరో రెండు స్టేషన్లలో ఆగనుంది. మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో కొత్త స్టాపులు ఇవ్వాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 20101/20102 నంబర్లతో నడుస్తున్న ఈ రైలు.. ప్రయోగాత్మకంగా ఈ రెండు చోట్ల ఆగనుంది. అయితే ఈ కొత్త స్టాపులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయాన్ని ఇంకా రైల్వే అధికారులు ప్రకటించలేదు.
మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతాల్లో ఎక్కువమంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వేత్తలు, కర్మాగార కార్మికులు.. రైలు ప్రయాణంపై ఆధారపడి ఉంటారు. ఈ క్రమంలోనే ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రయాణికుల నుంచి డిమాండ్ రావడంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్టేషన్లను వందే భారత్‌కి ప్రయోగాత్మక స్టాపులుగా చేర్చాలని రైల్వే బోర్డు ఇప్పటికే అధికారిక ఆదేశాలు జారీ చేసింది. కానీ అమలుయ్యే తేదీపై స్పష్టత రాకపోవడంతో ప్రయాణికులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
మంచిర్యాల కాంగ్రెస్ ఎంపీ వంశీ గడ్డం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. “మంచిర్యాలకు ఇది పెద్ద గుడ్ న్యూస్. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, దక్షిణ మధ్య రైల్వే జీఎం, రైల్వే బోర్డు చైర్మన్‌తో ఏడాది పాటు నేను చేసిన కృషి ఫలించింది. మంచిర్యాల ఇప్పటికే ఎదుగుతున్న పారిశ్రామిక కేంద్రం. ఈ కొత్త స్టాప్ స్థానిక ప్రజలు, పరిశ్రమలు, భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మన ప్రాంతానికి గర్వకారణం” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Big News for Mancherial! 🚆
After one year of consistent efforts and follow-ups with Railway Minister Shri Ashwini Vaishnaw ji, South Central Railway General Manager, and the Railway Board Chairman, I am very happy to share that Mancherial has officially been granted a stop.… pic.twitter.com/1nGShofMl2
— Vamsi Gaddam (@vkgaddam) August 30, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




