AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

పుంజు పంజా విసురుతోంది...! పందెం రాయుళ్లు తగ్గేదేలే అంటున్నారు...! అటు కరెన్సీ కట్టలు చేతులు మారుతుంటే... ఇటు బరుల దగ్గరే వండి పెడుతున్న వంటలు నోరూరిస్తున్నాయి...! నిన్న, ఇవాళ కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు సమాచారం.. మరోవైపు.. కోడి పందేల బరుల దగ్గర మద్యం పరవళ్లు, మాంసాహార విందులు కొనసాగుతున్నాయి.

కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?
Sankranti Rooster Fights
Shaik Madar Saheb
|

Updated on: Jan 15, 2026 | 9:30 PM

Share

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి సందడి మామూలుగా లేదు. ఏపీలో కోడిపందేలు హోరెత్తిస్తున్నాయి. పందెం రాయుళ్లు, వీక్షకులతో బరుల దగ్గర కోలాహలం నెలకొంది. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాక్‌ ఫైట్ కాకపుట్టిస్తోంది.

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సారి కోడి పందేల్లో గిఫ్టులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. కోడి పందేల్లో గెలిచినవారికి ఖరీదైన బైకులు, కార్లు బహుమతులుగా ఇస్తుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

ఇదే ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జాతరను తలపిస్తున్నాయి కోడి పందాలు. హైటెక్ పద్ధతిలో కార్పొరేట్ ఈవెంట్‌ను తలపించేలా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. స్టేడియం తరహాలో పందెం గ్యాలరీలు నిర్మించారు. వేలాది మందితో బరులు కిక్కిరిసిపోతున్నాయి. కోడి పందాల కోసం లైవ్ స్ట్రీమింగ్, రివ్యూ కోసం స్క్రీన్లు కూడా ఉన్నాయి. అంతేకాదు… క్రౌడ్ కంట్రోల్ కోసం బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు.

కో.. అంటే కోడి పందేలు.. కోడి పందేలంటే కోట్లు.. సంక్రాంతి కోడి పందేల్లో వందల కోట్లు చేతులు మారుతున్నాయి. నిన్న, ఇవాళ కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కోడి పందేల బరుల దగ్గర మద్యం పరవళ్లు, మాంసాహార విందులు కొనసాగుతున్నాయి.

హైలెట్ గా నిలిచిన రూ.1.53 కోట్ల కోడి పందెం

ఈ పందాల్లో పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెం హైలెట్ గా నిలిచింది. భారీ కోడి పందెం ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారింది. పైబోయిన వెంకటరామయ్య బరిలో రూ.1.53 కోట్ల కోడి పందెం నిర్వహించారు. గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ మధ్య పందెం జరగింది.. ఈ పందెంలో రాజమండ్రి రమేష్ కోడి గెలిచింది. ఈ పందెం చూసేందుకు చాలా మంది పోటీ పడ్డారు.

కోడి పందాలే కాదు… ఎడ్ల పందాలు, హార్స్‌ రైడింగులూ జోరుగానే సాగుతున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 38వ జాతీయస్థాయి బండ లాగుడు ఎడ్ల పోటీలు నిర్వహించగా… ఈ పోటీలను సినీ ఫైట్ మాస్టర్స్‌ రామ్‌, లక్ష్మణ్‌ ఆసక్తిగా తిలకించారు. అనకాపల్లి జిల్లా ఉమ్మలాడలో గుర్రాల పోటీలు ఉత్సాహంగా సాగాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..