Hyderabad: మహానగరంలో మట్టివాసన.. ట్రెండ్‌తోపాటు ట్రెడిషన్.. సంక్రాంతికి డబుల్ జోష్
హైదరాబాద్ మహానగరంలో మట్టివాసన.. కేరాఫ్ మాదాపూర్ శిల్పారామం. బ్యాక్ టు బేసిక్స్ అంటూ భాగ్యనగరవాసులు. పల్లెకు పోకుండానే పండగ చూసేద్దామా అంటూ అరుదైన అనుభూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారిక్కడ. ఎందుకంటే.. పండగ సంప్రదాయపు ఒరిజినాలిటీని టేస్ట్ చేసేలా.. పల్లె వాతావరణంతో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.

హైదరాబాద్ మహానగరంలో మట్టివాసన.. కేరాఫ్ మాదాపూర్ శిల్పారామం. బ్యాక్ టు బేసిక్స్ అంటూ భాగ్యనగరవాసులు. పల్లెకు పోకుండానే పండగ చూసేద్దామా అంటూ అరుదైన అనుభూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారిక్కడ. ఎందుకంటే, పండగ సంప్రదాయపు ఒరిజినాలిటీని టేస్ట్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. సెలవురోజులు కావడంతో శిల్పారామంలో సంక్రాతి శోభను చూసేందుకు క్యూలు కడుతున్నారు జనం..
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో అచ్చమైన పల్లె వాతావరణం సాక్షాత్కారమైంది. సంక్రాంతి అంటే కేవలం పండగే కాదని, సంప్రదాయం, ఆనందం కలిసిన అరుదైన ఉత్సవమని చాటిచెబుతూ అనేక కళారీతులు కొలువుదీరాయి.
గంగిరెద్దుల సయ్యాటలు, హరిదాసుల పాటలు, రంగురంగుల ముగ్గులు, గాలిపటాల పోటీలు.. ఒకటేమిటి? భోగి మంటలు, చెడుగుడు, బొమ్మల కొలువులు, హస్తకళలు, ఫోక్ డ్యాన్స్‌లు.. సర్వం సకలం ఇక్కడే. పండక్కి సొంతూర్లకు వెళ్లగా మిగిలిన జనం ఛలో శిల్పారామం అంటున్నారు. అందుకే మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఉంది రద్దీ ఇక్కడ. సంక్రాంతి మూడు రోజులూ సందర్శకుల తాకిడి పెరిగి, కిటకిటలాడుతోంది మాదాపూర్ శిల్పారామం..
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
