AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Pratibha Setu Portal: యూపీఎస్సీ అభ్యర్ధుల కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ.. వారికిది సెకండ్‌ డోర్‌!

దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఒకటి. ప్రతీయేటా ఎంతో మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాసినా చివరి నిమిషంలో అవకాశం కోల్పోయేవారు వేలల్లో ఉన్నారు. దీంతో ఎంతో సమయం, డబ్బు వృధా అవుతుంది. నిజాయతీగా కష్టపడుతున్న ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్‌ తుది జాబితాలో చోటు దక్కించుకోలేక వెనుదిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం..

UPSC Pratibha Setu Portal: యూపీఎస్సీ అభ్యర్ధుల కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ.. వారికిది సెకండ్‌ డోర్‌!
PM Modi launches UPSC PRATIBHA Setu portal
Srilakshmi C
|

Updated on: Aug 31, 2025 | 4:28 PM

Share

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 31: యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ పోర్టల్‌ ద్వారా సివిల్‌ సర్సెంట్‌ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మన్‌కీ బాత్‌ 125వ ఎపిసోడ్‌లో ఈ పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఒకటి. ప్రతీయేటా ఎంతో మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాసినా చివరి నిమిషంలో అవకాశం కోల్పోయేవారు వేలల్లో ఉన్నారు. దీంతో ఎంతో సమయం, డబ్బు వృధా అవుతుంది. నిజాయతీగా కష్టపడుతున్న ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్‌ తుది జాబితాలో చోటు దక్కించుకోలేక వెనుదిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రతిభా సేతు పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల అన్ని దశలలో ఉత్తీర్ణత సాధించినా.. ఇంటర్వ్యూ ప్రక్రియ తర్వాత తుది మెరిట్‌ లిస్టులో పేరు లేని అభ్యర్థుల వివరాలు ఇకపై ఈ పోర్టల్‌లో ఉంచనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఆ వివరాలు ప్రైవేట్ కంపెనీలు తీసుకొని.. తమ సంస్థలలో వారికి ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన వ్యూహాత్మక పోర్టల్ ఇది. ఇందుకోసం UPSC ప్రతిభా సేతు పోర్టల్ డైనమిక్ డేటాబేస్‌గా పనిచేస్తుందన్నారు.

ఏయే పరీక్షలు ఇది కవర్ చేస్తుందంటే?

  • సివిల్ సర్వీసెస్ పరీక్షలు (IAS, IPS, మొదలైనవి)
  • ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష
  • ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష
  • కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDS)
  • కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
  • కేంద్ర సాయుధ పోలీసు దళాల (ACs) పరీక్షలు
  • ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్
  • కంబైన్డ్ జియో-సైంటిస్ట్ పరీక్ష

అయితే NDA & NA వంటి పరీక్షలు, కొన్ని పరిమిత విభాగ పోటీలు మాత్రం ఈ పథకం కింద కవర్ చేయరు. అయితే ఇందులో అందరు అభ్యర్ధుల వివరాలను నమోదు చేయరు. అభ్యర్థుల ఇష్టానుసారమే డేటాబేస్‌లో చేర్చడం జరుగుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు), స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రైవేట్ రంగ కంపెనీలు సహా ధృవీకరించబడిన యజమానులు UPSC అందించిన ప్రత్యేక లాగిన్ ID ద్వారా ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోకుని అందులోని అభ్యర్ధులను ఎంపిక చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ చొరవ UPSC అభ్యర్థులకు సెకండ్‌ ఛాన్స్‌ అందించే సెకండ్ డోర్‌ వంటిది. వారికి కృషి తగిన ప్రతిఫలం ఈ పోర్టల్ ద్వారా అందించేందుకు వీలు కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.