Watch Video: కదులుతున్న బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు.. హెల్పర్‌కి స్టీరింగ్ అప్పగించి అంతలోనే..!
ఓ వ్యక్తి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును నడుపుతున్నాడు. అంతలో ఏదో నలతగా అనిపించింది. అంతే పక్కనే ఉన్న కో-డ్రైవర్‌ను పిలిచి, డ్రైవింగ్ చేయమని చెప్పి, అతడు పక్కనే కూర్చున్నాడు. అంతలోనే ఒక్కసారిగా అతడు కుప్పకూలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ హృదయవిదారక..

రాజస్థాన్, ఆగస్ట్ 30: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును నడుపుతున్నాడు. అంతలో ఏదో నలతగా అనిపించింది. అంతే పక్కనే ఉన్న కో-డ్రైవర్‌ను పిలిచి, డ్రైవింగ్ చేయమని చెప్పి, అతడు పక్కనే కూర్చున్నాడు. అంతలోనే ఒక్కసారిగా అతడు కుప్పకూలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ముందు జాగ్రత్తగా స్టీరింగ్ కో డ్రైవర్‌కు ఇచ్చి ప్రయాణికుల ప్రాణాలను కాపాడి.. తాను మృత్యుఒడికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
సతీశ్ రావు (34) అనే వ్యక్తి ఇండోర్ నుంచి జోధ్‌పూర్ వెళ్లే ప్రైవేట్ బస్సును నడుపుతున్నాడు. బస్సు రన్నింగ్‌లో ఉండగా మార్గం మధ్యలో సతీశ్ రావు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ముందు జాగ్రత్తగా కో డ్రైవర్‌ను పలిచి, అతడికి స్టీరింగ్ అప్పగించి, డ్రైవింగ్ చేయమని చెప్పాడు. అనంతరం అతడి పక్కనే కూర్చుని విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. డ్రైవింగ్ సీట్‌లో నుంచి పక్కకు జరిగిన సతీశ్ రావు ఆరోగ్యం కాసేపటికే మరింత దిగజారింది. కో డ్రైవర్ సమీపంలోని మెడికల్ స్టోర్‌కు వెళ్లాడు. కానీ అది మూసివేయబడింది. మరో ఆస్పత్రికి చేరుకునేలోపే కదులుతున్న బస్సులోనే సతీశ్ రావు ఉన్నట్లుండి కూర్చున్న చోటే కుప్పకూలి మరణించాడు. డ్రైవర్ సతీష్ రావుకు చికిత్స అందించేందుకు కో డ్రైవర్ ఎంత వేగంగా ప్రయాణించినా అతడిని కాపాడలేకపోయాడు.
View this post on Instagram
ఈ ఘటనతో బస్సులోని వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొన్ని సెకన్లలోనే ప్రయాణికుల్లో కొంతమంది వ్యక్తులు డ్రైవర్ చాంబర్‌లోకి వచ్చి సతీశ్ రావును ఎత్తుకుని, ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సైలెంట్ స్ట్రోక్ వల్లనే సతీశ్‌రావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చివరి నిమిషంలో స్టీరింగ్ కోడ్రైవర్‌కు ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




