AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IB Job Notification 2025: ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు!

ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ఇప్పటికే వరుసగా పలు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

IB Job Notification 2025: ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు!
Intelligence Bureau Job Notification
Srilakshmi C
|

Updated on: Aug 26, 2025 | 9:08 AM

Share

భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ఇప్పటికే వరుసగా పలు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ముగింపు గడువులోకిగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

కేటగిరీల వారీగా పోస్టు వివరాలు ఇలా..

  • యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 157
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 32
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 117
  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 60
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 28

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్.. స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదంటే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి సెప్టెంబర్‌ 14, 2025 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 యేళ్లు, ఓబీసీలకు 3 యేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆనలైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 14, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈఎస్ఎం కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. టైర్‌ I (ఆన్‌లైన్ ఎగ్జామ్), టైర్‌-II (స్కిల్ టెస్ట్), టైర్‌-III (ఇంటర్వ్యూ) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతంతోపాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు అందిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఎంహెచ్‌ఏ వెబ్‌సైట్, ఎన్‌సీఎస్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఈ 7 లావాదేవీలకు ఇకపై పాన్ కార్డ్ అవసరం లేదు.. ఇవే కొత్త నిబంధనలు
ఈ 7 లావాదేవీలకు ఇకపై పాన్ కార్డ్ అవసరం లేదు.. ఇవే కొత్త నిబంధనలు
ఒంటిపై వేలాది తేనెటీగలు.. అయినా సరే నో టెన్షన్! వీడియో వైరల్
ఒంటిపై వేలాది తేనెటీగలు.. అయినా సరే నో టెన్షన్! వీడియో వైరల్
కడప జిల్లాలో స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా..
కడప జిల్లాలో స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా..
గ్రామీణ ప్రాంతాలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్..
గ్రామీణ ప్రాంతాలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్..
30 రోజుల్లోగా ఈ పని చేయండి.. లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ కట్
30 రోజుల్లోగా ఈ పని చేయండి.. లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ కట్
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?
లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది
లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..