Hyderabad: తికమకలో వేరే బుక్ ఇచ్చాడనీ.. ఒకటో తరగతి పిల్లాడిని చితకబాదిన లేడీ టీచర్!
నేటి కాలంలో టీచర్లు బాధ్యతలు మరచి విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ బడుల్లో సంగతి సరేసరి. తాజాగా ఓ ప్రైవేట్ స్కూల్లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఓ బాలుడిని టీచర్ నోట్ బుక్ తీసుకురావాలని కోరింది. అయితే బాలుడు తికమక పడి..

హైదరాబాద్, ఆగస్ట్ 19: విద్యార్ధుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సింహభాగం బాధ్యత టీచర్‌దే. ఆ తర్వాత తల్లిదండ్రులు, ఇతరుల పాత్ర ఉంటుంది. అయితే నేటి కాలంలో టీచర్లు బాధ్యతలు మరచి విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ బడుల్లో సంగతి సరేసరి. తాజాగా ఓ ప్రైవేట్ స్కూల్లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఓ బాలుడిని టీచర్ నోట్ బుక్ తీసుకురావాలని కోరింది. అయితే బాలుడు తికమక పడి ఒక బుక్‌కు బదులు మరొకటి తీసుకెళ్లాడు. అంతే సదరు టీచర్ పిల్లాడిని అత్యంత క్రూరంగా చితకబాదింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ ఎర్రగడ్డలోని గౌతమపురి కాలనీలోని ది మోడల్ సిటీ హైస్కూల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హైదరాబాద్ ఎర్రగడ్డలోని గౌతమపురి కాలనీలోని ది మోడల్ సిటీ హైస్కూల్‌లో మహమ్మద్ రియాజ్ ఖాన్ అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే క్లాస్ చెప్పేటప్పుడు టీచర్ తబుస్సుమ్ బేగం.. మహమ్మద్ రియాజ్ ఖాన్‌ను నోట్ బుక్ తీసుకురావాలని అడిగింది. కానీ రియాజ్ అడిగిన బుక్‌కు బదులుగా మరోక బుక్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన టీచర్ తుబుస్సుమ్ బేగం.. చిన్నారి వీపుపై వాతలు పొంగేలా చితకబాదింది.
సాయంత్రం స్కూల్ వదిలిన ఇంటికి వెళ్లిన రియాజ్ ఖాన్ తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే బోరబండ పోలీస్ స్టేషన్‌లో సదరు టీచర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్కూల్ టీచర్‌పై ఇంత వరకూ పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విశేషం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




