Video: రోడ్డుపై కత్తితో గురుప్రీత్ సింగ్ హల్చల్.. కాల్చి చంపిన పోలీసులు!
లాస్ ఏంజిల్స్ పోలీసులు 36 ఏళ్ల సిక్కు వ్యక్తి గురుప్రీత్ సింగ్‌ను కాల్చి చంపారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో సింగ్ గట్కాను ప్రదర్శిస్తున్నట్లు కనిపించింది. పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించినందున కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

గురుప్రీత్ సింగ్ అనే 36 ఏళ్ల సిక్కు వ్యక్తిని రోడ్డు మధ్యలో లాస్ ఏంజిల్స్ పోలీసులు కాల్చి చంపారు. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD) విడుదల చేసిన ఫుటేజ్ ప్రకారం.. సింగ్ సాంప్రదాయ సిక్కు యుద్ధ కళలలో ఒకటైన గట్కాను ప్రదర్శిస్తున్నాడు. లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లోని క్రిప్టో.కామ్ అరీనా సమీపంలో అతను ఒక కత్తి పట్టుకుని ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతను లొంగిపోవడానికి నిరాకరించడంతో పాటు పోలీసులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించడంతో అతన్ని కాల్చి చంపారు.
ఆ కత్తిని తరువాత “ఖండా”గా గుర్తించారు. ఇది భారతీయ యుద్ధ కళలలో ఉపయోగించే రెండు వైపులా పదును ఉన్న కత్తి. జూలై 13న ఫిగ్యురోవా స్ట్రీట్, ఒలింపిక్ బౌలేవార్డ్ రద్దీగా ఉండే కూడలి వద్ద ఒక వ్యక్తి పెద్ద బ్లేడును ఊపుతున్నట్లు LAPDకి అనేక 911 కాల్స్ వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సింగ్ తన వాహనాన్ని రోడ్డు మధ్యలో వదిలేసి, ఒక సమయంలో తన నాలుకను కోసుకోవడానికి కూడా ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. “ఆయుధాన్ని పడవేయమని అధికారులు సింగ్‌కు అనేక ఆదేశాలు ఇచ్చారు” అని పోలీసులు తెలిపారు.
పోలీసులు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించడానికి ముందు వారిపై ఒక సీసా విసిరాడు. అధికారులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా వాహనంలో పారిపోయే ప్రయత్నం చేసి మరొక పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ తర్వాత అతను ఫిగ్యురోవా వీధుల సమీపంలో ఆగిపోయాడు. ఆ తర్వాత బ్లేడుతో పోలీసులపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో రెండు అడుగుల పొడవున్న ఒక కత్తిని స్వాధీనం చేసుకుని, దానిని సాక్ష్యంగా నమోదు చేశారు పోలీసులు. కాల్పుల్లో గాయపడిన గురుప్రీత్‌ను ఆస్పత్రికి తరలించే క్రమంలో అతను మరణించాడు. కాల్పుల ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
Los Angeles police shot dead Gurpreet Singh, 35, after he stopped his car in the middle of an intersection and allegedly swung a machete at people.
Now compare this with India. Here, mobs can assault police, humiliate them into folding hands, circulate those images as “victory,”… pic.twitter.com/N2Hsyuif9V
— THE SKIN DOCTOR (@theskindoctor13) August 29, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




