PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం ఉంది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

మహబూబ్ నగర్ సీన్ నిజామాబాద్‎లో కూడా మళ్లీ రిపీట్ అయ్యింది. ప్రధాని మోదీ వరుస సభలు తెలంగాణ బీజేపీ లో కొత్త జోష్ ని నింపుతున్నాయి. మొన్న రూ.13500 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మోదీ ఈరోజు నిజామాబాద్ లో కూడా 8 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో భారీ స్పందన వచ్చింది. పసుపు కొమ్ములతో చేసిన దండను వేసి మోదీకీ కృతజ్ఞతలు తెలియజేసారు అక్కడి పసుపు రైతులు.

PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం ఉంది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
PM Narendra Modi
Follow us

| Edited By: Aravind B

Updated on: Oct 03, 2023 | 7:36 PM

మహబూబ్ నగర్ సీన్ నిజామాబాద్‎లో కూడా మళ్లీ రిపీట్ అయ్యింది. ప్రధాని మోదీ వరుస సభలు తెలంగాణ బీజేపీ లో కొత్త జోష్ ని నింపుతున్నాయి. మొన్న రూ.13500 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మోదీ ఈరోజు నిజామాబాద్ లో కూడా 8 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో భారీ స్పందన వచ్చింది. పసుపు కొమ్ములతో చేసిన దండను వేసి మోదీకీ కృతజ్ఞతలు తెలియజేసారు అక్కడి పసుపు రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నా కుటుంబ సభ్యులారా.. అంటూ స్పీచ్ ప్రారంభించారు మోదీ.  నా స్పీచ్ ప్రారంభించే ముందు ఈ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చిందంటూ భారత మాత వేషధారణ వేసిన చిన్నారిని సంబోధిస్తూ సభకు వచ్చిన ఆ చిన్నారికి నా తరుపున అభినందనలు అని అన్నారు. మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడం.. చాలా సంతోషంగా ఉందని.. ఎన్టీపీసీ సూపర్ పవర్ థర్మల్ యూనిట్‎కు శంకుస్థాపన చేసే అవకాశం దక్కిందని.. అలాగే మహిళలు, సబ్బండ వర్గాలు నన్ను ఆశీర్వదించేందుకు ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ మహిళలు ఇతిహాసాన్ని లిఖించారని.. నారీశక్తిని చూపించారని అన్నారు. కాంగ్రెస్, ఇండియా అలియన్స్‌ను నమ్మొద్దని వారికి ఎవరి గురించి అక్కర్లేదు వారు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు కానీ నారీ శక్తి ముందు వారి కథలు సాగవని అన్నారు. ఇప్పటి వరకు మహిళలంతా తమ ఓటు శక్తితో.. ప్రతి ఒక్కొక్కరి ఓటుతో వారి బిడ్డలాగా నన్ను ఆశీర్వదించారు.. భవిష్యత్ లో ఆశీర్వదిస్తారు కూడా అనే ఆశభవాన్ని వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. అలాగే కరోనా వస్తే ప్రపంచానికి వ్యాక్సిన్ పంపిన దేశం మనది మీ మద్దతుతోనే అభివృద్ధి పనులు చేపడుతున్నానని..ఇది మోద్దీ ఇచ్చే గ్యారెంటీకి నిదర్శనంమని..నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా సలాం అని అన్నారు. మీకు గుర్తుందా?.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్‎కు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. నిజాంలను తరిమికొట్టేందుకు అందరూ భయపడ్డారు కానీ ఒక గుజరాతీ బిడ్డ వచ్చాడు.. అతడే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన వచ్చాకే హైదరాబాద్ కు విముక్తి లభించింది. ఇప్పుడు మళ్లీ ఇంకో గుజరాతీ బిడ్డ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అతడు మీ కోసం మరో పటేలలాగా పోరాడుతాడు అని ప్రధాని మోదీ అన్నారు.

బీజేపీ కొత్త రైల్వే లైన్, హాస్పిటళ్లు ప్రారంభించి తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించిందని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూడా లూటీ చేసిందని ఆరోపించారు. ప్రజా తంత్రను.. పరివార్ తంత్రగా మార్చారని.. తెలంగాణ కోసం ఎందరో బిలిదానాలు చేసుకున్నారు కానీ.. ఒక్క కుటుంబం మాత్రం మొత్తాన్ని కబ్జా చేసిందని.. ఆ కుటుంబాన్ని ఎవరూ అని అడగలేని పరిస్థితి ఏర్పడిందని ప్రధాని విమర్శించారు. ఒక్క కుటుంబం.. లక్షల కుటుంబాలను కబ్జా చేసిందని.. కొడుకు, బిడ్డ, అల్లుడు, మరో కొడుకు, అత్తగారింటి వారు ఇలా ఎవరూ వదలకుండా తెలంగాణను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందని.. కొడుకు, అల్లుడు అంతా కలిసి భారీ అవినీతికి పాల్పడుతున్నారంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒక్క కుటుంబానికి కొందరు సేవ చేస్తున్నారని.. అలాంటి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారని.. అంతేకాని తెలంగాణ కోసం పోరాడిన వారిని, నిరుద్యోగులను కేసీఆర్ విస్మరించారని ప్రధాని అన్నారు. తెలంగాణ యువతకు కనీసం ఉద్యోగాల్లో కనీసం అవకాశం కూడా ఇవ్వడంలేదని.. కుటుంబ పాలనతో యువత తీవ్రంగా నష్టపోతోందని.. కానీ బీజేపీ సామాన్యులకు కూడా అన్నింట్లోను అవకాశాలు కల్పిస్తోందని అన్నారు ప్రధాని.

ఇవి కూడా చదవండి

మరోవైపు ప్రధాని కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఆ పార్టీ పెద్ద ఖిలాడీ పార్టీ అని.. దేశం, దేశ ప్రజల గురించి వారికి ఎలాంటి పట్టింపు ఉండదని ఆరోపణలు చేశారు. ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందంటే తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అన్నారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం ఉందని.. బీఆర్ఎస్.. కాంగ్రెస్‎కు బీ టీంగా మారిందని.. ఈ రెండు పార్టీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీలు జరుగుతున్నాయని.. అందుకే ఈసారి బీఆర్ఎస్ ఓడిపోతుందన్నారు ప్రధాని. అలాగే నా పక్కన అవినీతిపరులకు ఛాన్స్ లేదని.. కాంగ్రెస్ దక్షిణభారత దేశానికి అన్యాయం చేసిందని అలాగే వారు మైనారిటీలను కూడా అన్యాయం చేశారని ప్రధాని ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి మీరేం చేశారో కాంగ్రెస్ నేతలు నాకు స్పష్టం చేయండి అంటూ ప్రశ్నలు గుప్పించారు ప్రధాని మోదీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..