Viral video: రెప్పపాటు నిర్లక్ష్యం ఎంతటి నష్టాన్ని మిగిలిస్తుందో చూడండి.. వైరల్ వీడియో
ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైనే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయో, ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలో విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఇట్టే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. నిర్లక్ష్యం, ఆతృత.....
చిన్న నిర్లక్ష్యం జీవితంలో భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితిని తెస్తుంది. తెలిసో, తెలియకో ఆతృతతోనే చేసే పనులు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ముఖ్యంగా రోడ్డుపై ప్రయాణించే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారులు, మీడియా ఎన్ని రకాలుగా అర్థమయ్యేలా చెప్పినా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైనే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయో, ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలో విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఇట్టే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. నిర్లక్ష్యం, ఆతృత ఎంత భయంకరమో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందీ వీడియో.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం ఈ సంఘటన మజీద్‌పూర జంక్షన్ వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ఓ కూడలి వద్ద వాహనాలు వేగంగా వెళుతున్నాయి. అదే సమయంలో ఓ స్కూటీ వస్తున్న వ్యక్తి రోడ్డును దాటాలని ప్రయత్నించాడు. ఆతృతలో అసలు ఎదురుగా ఏ వాహనం వస్తుందన్న విషయాన్ని కూడా గమనించకుండా స్కూటీని వేగంగా డ్రైవ్ చేస్తూ ముందుకెళ్లాడు. అయితే అవతలి వైపు నుంచి ఓ వేగంగా దూసుకొచ్చిన ఆల్టో కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రోడ్డుపై కుప్ప కూలిపోయాడు. స్కూటీ కాస్త అవతలి రోడ్డుపైకి ఎగిరిపడిపోయింది.
సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేసిన వీడియో..
ముందుగా వెళ్లే హక్కు (Right of Way)
ఏదైనా కూడలి వద్ద ప్రధాన రహదారిలో వెళ్లే వాహనాలకు ముందుగా వెళ్లే అనుమతి ఉంటుంది. ఇతర రోడ్డుల నుండి వచ్చే వాహనాలు ప్రధాన రహదారిలో ఎలాంటి వాహనాలు లేనప్పుడు జాగ్రత్తగా గమనించి వెళ్ళాలి.#RoadSafety pic.twitter.com/nnAIBLrjuw
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) October 3, 2023
ఇదంతా అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోతోపాటు.. ముందుగా వెళ్లే హక్కు (Right of Way)ను వివరిస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘ఏదైనా కూడలి వద్ద ప్రధాన రహదారిలో వెళ్లే వాహనాలకు ముందుగా వెళ్లే అనుమతి ఉంటుంది. ఇతర రోడ్డుల నుండి వచ్చే వాహనాలు ప్రధాన రహదారిలో ఎలాంటి వాహనాలు లేనప్పుడు జాగ్రత్తగా గమనించి వెళ్ళాలి’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ వీడియోలో ఉన్న తేదీ చూస్తే ఈ సంఘటనల గతంలోనే జరిగినట్లు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతోంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..