‘ఇలా చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..’ షాకింగ్ వీడియోలు.. సజ్జనార్ ట్వీట్ వైరల్..

'దిశ' ఎన్‌కౌంటర్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఐపీఎస్ సజ్జనార్.. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఎన్నో సంచలన కేసులు చేధించటంతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు సజ్జనార్. ఇటీవల సమస్యలను 'X' ద్వారా పోస్ట్‌లు చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు.

'ఇలా చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..' షాకింగ్ వీడియోలు.. సజ్జనార్ ట్వీట్ వైరల్..
Viral Video
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 03, 2023 | 7:27 PM

‘దిశ’ ఎన్‌కౌంటర్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఐపీఎస్ సజ్జనార్.. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఎన్నో సంచలన కేసులు చేధించటంతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు సజ్జనార్. ఇటీవల సమస్యలను సామాజిక మాధ్యమం ‘X’ ద్వారా పోస్ట్‌లు చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్‌పై ఆయన సైబరాబాద్ సీపీగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు దాని మీద పోరాడుతూనే ఉన్నారు. తాజాగా క్యూనెట్ స్కాంపై ఒక రేంజ్‌లో అవగాహన కల్పించారు సజ్జనార్. ఎప్పుడు ‘క్యూ నెట్’ పేరు తెర మీదకు వచ్చినా, వాటిపై స్పందిస్తూ ఆవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇక తాజాగా మరో ఘటనపై స్పందించారు సజ్జనార్. సిటీ చివరలో జరుగుతున్న బైక్ రేసింగ్‌లపై తనదైన రీతిలో పోస్ట్ పెట్టారు.

సాధారణంగా వీకెండ్‌లో బైక్ రేసింగ్ సిటీ శివార్లలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నగర శివారులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో యదేచ్ఛగా బైక్ రేసింగ్ జరుగుతూనే ఉంది. బైక్ రేసింగ్ చేయడమే కాకుండా రేసింగ్‌కి పాల్పడుతున్న యువకులు, వారు చేసిన విన్యాసాలను వీడియోల రూపంలో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను ఉదాహరణగా చూపిస్తూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ‘X’ ఖాతా నుంచి స్పందించారు. ‘తలకెక్కిన వెర్రి’ అంటే ఇదేనంటూ పోస్ట్ పెట్టారు.

రేసింగ్‌లో భాగంగా ఒక యువకుడు ఏకంగా బైక్‌పై నిలబడి విన్యాసాలు చేశాడు. ఒక్కసారిగా తన టూ వీలర్ వాహనం అదుపు తప్పి స్కిడ్ అయింది. దీంతో యువకుడు కింద పడిపోయాడు. టూ వీలర్ వాహనం ఒకవైపు.. యువకుడు మరోవైపు పడిపోయారు. యువకుడు నడిపిన టూ వీలర్ వాహనం ఢీకొని మరో బైక్ స్కిడ్ అయింది.

ఎప్పుడూ యూత్‌కు ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటారు సజ్జనార్. అది మల్టీ మార్కెటింగ్ స్కామ్ అయినా, రేసింగ్ అయినా, గ్యాంబ్లింగ్ అయినా, పబ్లిసిటీ స్టంట్ లు అయినా, ఈజీ మనీ కోసం వెళితే ఈజీగా కష్టాలు వస్తాయని యువతకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?