ఆ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టిన కేటీఆర్, అసద్.. బీజేపీపై ఘాటైన విమర్శలు..
తెలంగాణ రాజకీయంగా చాలాకాలం పాటు రాష్ట్రం నుంచి దేశం దాకా దుమారం లేపిన స్టీరింగ్ వివాదానికి ఎట్టకేలకు మంత్రి కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పుల్‌స్టాప్ పెట్టారు. ఆ స్టీరింగ్ కథ సంగతేంటి.? ఇంతకీ అసలేం జరిగిందంటే..? ఈ స్టోరీలో తెలుసుకుందామా.. అప్పుడెప్పుడో బీఆర్‌ఎస్ స్టీరింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో భద్రంగా ఉందని చెప్పిన మంత్రి కేటీఆర్..
హైదరాబాద్, అక్టోబర్ 3: రాజకీయంగా చాలాకాలం పాటు రాష్ట్రం నుంచి దేశం దాకా దుమారం లేపిన స్టీరింగ్ వివాదానికి ఎట్టకేలకు ఇద్దరు అగ్రనేతలు పుల్‌స్టాప్ పెట్టారు. ఆ స్టీరింగ్ సంగతేంటి.? ఇంతకీ అసలేం జరిగిందంటే..? ఈ స్టోరీలో తెలుసుకుందామా..
అప్పుడెప్పుడో బీఆర్‌ఎస్ స్టీరింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో భద్రంగా ఉందని చెప్పిన మంత్రి కేటీఆర్.. అదే విధంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని తెలిపారు. ఇక భారతీయ జనతా పార్టీ స్టీరింగ్ మాత్రం దేశంలో ధనవంతులైన అదానీ, అంబానీ చేతుల్లో ఉందని, వాళ్లు ఏం చెబితే బీజేపీ నేతలు అదే చేస్తారని, ప్రభుత్వ ఆస్తులను వారికి కట్టబెట్టడంలో ముందుంటారంటూ కేటీఆర్ కాషాయ పార్టీ పెద్దలపై ఘాటైన విమర్శలు గుప్పించారు.
మరోవైపు కొన్ని సంవత్సరాల క్రితం చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ టీఆర్‌ఎస్ స్టీరింగ్ తమ చేతిలో ఉందంటూ వ్యాఖ్యానించడంతో దేశవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక రాజకీయ పార్టీలు, అగ్రనేతలు కూడా ఎంఐఎం, బీఆర్‌ఎస్ దోస్తీపై ఘాటు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ విమర్శలకు ఎంఐఎం నేతలు కూడా ధీటుగా బదులిచ్చారు. తమ చేతిలో పగ్గాలుంటే పాతబస్తీని ఎంతో అభివృద్ధి చేసుకునేవాళ్లమన్నారు. అధినేత అసదుద్దీన్ స్వయంగా రంగంలోకి దిగి ఆ మరకను తుడిచే ప్రయత్నాలు కూడా చేశారు. అయినా విమర్శలు అంతటితో ఆగలేదు. రేవంత్ నుంచి అమిత్‌షా వరకు, యోగి నుంచి ప్రధాని మోదీ వరకు ప్రతి ఒక్క నేత ఎంఐఎం చేతిలో బీఆర్‌ఎస్ స్టీరింగ్ ఉందంటూ కామెంట్లు చేశారు.
కానీ పాతబస్తీలో అక్టోబర్ 2న జరిగిన ఓ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ ఇద్దరు కలిసి కారు స్టీరింగ్ వివాదంపై స్పందించారు. ఎవరి స్టీరింగూ తమ చేతిలో లేదంటూ ఓవైసీ వ్యాఖ్యానిస్తే.. బీజేపీ స్టీరింగ్ ధనవంతుల దగ్గరుందంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ కారు స్టీరింగ్ వివాదానికి తెరపడిందని అంతా అనుకుంటున్నారు. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ పథకాలను పొగుడుతూ.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఏ సభలో పాల్గొన్నా బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తేవాలని ప్రజలను కోరుతున్నారు. కాగా, ఇదంతా చూస్తుంటే రెండు పార్టీల దోస్తీ ఎక్కడ బలపడుతుందోనని ప్రతిపక్ష పార్టీల నేతల్లో కంగారు మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..