Hyderabad: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కుమార్తె పెళ్లి కోసం స్వదేశానికి వస్తుండగా విషాదం!
హైదరాబాద్ వాసి లండన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఉపాది కోసం లండన్ వెళ్లిన మహ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ (65)ను సెస్టెంబర్ 30వ తేదీన గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తీవ్రంగా కొట్టి హత్య చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న పర్స్, ఫోన్ ఎత్తుకెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లోని లీడ్స్ వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే...
లండన్, అక్టోబర్ 3: హైదరాబాద్ వాసి లండన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఉపాది కోసం లండన్ వెళ్లిన మహ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ (65)ను సెస్టెంబర్ 30వ తేదీన గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తీవ్రంగా కొట్టి హత్య చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న పర్స్, ఫోన్ ఎత్తుకెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లోని లీడ్స్ వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..
మహ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ ఇద్దరు ఉగాండా జాతీయులతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నిందితులిద్దరూ రయీస్ ఉద్దీన్‌ను కత్తితో పొడిచి హతమార్చారు. అతనితోపాటు అప్ఘనిస్తాన్‌కు చెందని మరొక వ్యక్తిని కూడా కత్తితో పొడిచి పరారయ్యారు. యూకే పోలీసులు మహ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మృతుడి బావ మహ్మద్ అహ్మద్ అలీ సోమవారం (అక్టోబర్ 2) మీడియాకు తెలిపారు.
కాగా మహ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ 2011లో యూకేకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అతని కుమార్తె వివాహం అక్టోబర్ 5న జరగాల్సి ఉంది. దీంతో భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో రయీస్ ఉద్దీన్ హత్యకు గురయ్యాడు. మృతుడి కుటుంబం హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో నివాసం ఉంటోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన లండన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ ముజీబ్ తనకు తెలియజేశారని ఎంబీటీ నాయకుడు, సామాజిక కార్యకర్త అమ్జెద్ ఉల్లా ఖాన్ తెలిపారు. మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు.
మృతుడు రయీస్ ఉద్దీన్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ లండన్‌లోని భారత హై కమిషన్‌ను కోరారు. మరోవైపు ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. రయీస్ ఉద్దీన్ హత్యకు దారితీసిన అసలు కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.