ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. ఆస్థి కోసం గర్భవతైన పిన్నిని దారుణంగా..
ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టాడు. సవతి కొడుకు.. పిన్నిని దారుణంగా హత్య చేసిన సంఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని టెకూర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు రేణుకకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.. ఈ క్రమంలోనే..

ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టాడు. సవతి కొడుకు.. పిన్నిని దారుణంగా హత్య చేసిన సంఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని టెకూర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు రేణుకకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.. ఈ క్రమంలోనే.. చిగురుమామిడి మండలం, బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళను 8సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు రాములు.. టెకూర్తి గ్రామంలో వేరు వేరు ఇళ్లల్లో ఇద్దరు భార్యలతో సంసార జీవితం సజావుగా సాగింది. ఈ క్రమంలో తిరుమల గర్భవతి అని తెలిసినా నాటి నుండి ఇంట్లో మొదటి భార్య కొడుకులతో తండ్రి రాములుకు గొడవలు జరుగుతున్నాయి. తండ్రి రాములు సంపాదించిన ఆస్తిలో రెండవ భార్యకు పుట్టబోయే బిడ్డకు వాటా దక్కుతుందేమో అన్న అనుమానం చిన్న కొడుకు బన్నీ మనసులో పెరిగింది.
గతంలో అనేక సార్లు ఇరువర్గాల మధ్య గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ వరకు చేరింది పంచాయతీ.. పోలీసుల సమక్షంలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు తండ్రి రాములు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఏడో నెల గర్భిణి తిరుమలపై రాములు మొదటి భార్య చిన్న కొడుకు బన్నీ దాడి చేసి కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. దీంతో సంఘటన స్థలంలోనే రక్తపు మడుగులో తిరుమల మృతి చెందింది.
గర్భంలోని శిశువు బ్రతుకుతుందేమో అని పోలీసులు తిరుమల మృతదేహాన్ని108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పరీక్షించిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందిందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. టెకూర్తి గ్రామంలో ఈ దారుణ ఘటన కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




