KTR: రాహుల్, మోదీ కలిసి చర్చించుకుంటే అరగంటలో బిల్లు పాస్: కేటీఆర్ ఏమన్నారంటే..
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై అందరూ ఒకే మాటపై ఉన్నారని..ఇది అసెంబ్లీలో తేలే అంశం కాదని రాహుల్ గాంధీ, మోదీ కలిసి చర్చించుకుంటే అరగంటలో బిల్లు పాస్ అవుతుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై అందరూ ఒకే మాటపై ఉన్నారని..ఇది అసెంబ్లీలో తేలే అంశం కాదని రాహుల్ గాంధీ, మోదీ కలిసి చర్చించుకుంటే అరగంటలో బిల్లు పాస్ అవుతుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. చట్టాల్లో లొసుగులు ఉంటే కచ్చితంగా కోర్టుకు వెళ్తారన్నారు. కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం.. కోర్టులపై తమకు అపారమైన నమ్మకం గౌరవం ఉన్నాయన్నారు. అంత గౌరవం ఉంటే పదిమంది ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పుని గౌరవించండంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటివరకు సీఎం 52సార్లు ఢిల్లీకి వెళ్లారని.. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కూర్చుని..ఆమరణ నిరాహార దీక్ష చేయాలంటూ కేటీఆర్ సూచించారు.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

