AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం దొంగలు రా బాబు.. ఫోన్లు కొట్టేసి.. ఐఎంఈఐ నంబర్లు మార్చేశారు.. చివరికి

ఈ మధ్య దొంగతనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో అనేక స్కామ్‌లు జరుగుతున్నాయి. అయితే తాజాగా సెల్‌ఫోన్లను దొందతన చేస్తూ వాటి ఈఎంఈఐ నంబర్లు మార్చేసి మార్కెట్‌లో అమ్ముకుంటున్న మూఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి మూడు లక్షల రూపాయల నగదుతో పాటు దాదాపు 1.92 కోట్ల విలువైన 563 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన గారడి రామాంజీ అనే వ్యక్తి తన చదువు పూర్తి చేసుకోని హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. 1995లో ఫలక్‌నుమా డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు.

ఏం దొంగలు రా బాబు.. ఫోన్లు కొట్టేసి.. ఐఎంఈఐ నంబర్లు మార్చేశారు.. చివరికి
Thief
Aravind B
|

Updated on: Aug 10, 2023 | 4:39 PM

Share

ఈ మధ్య దొంగతనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో అనేక స్కామ్‌లు జరుగుతున్నాయి. అయితే తాజాగా సెల్‌ఫోన్లను దొందతన చేస్తూ వాటి ఈఎంఈఐ నంబర్లు మార్చేసి మార్కెట్‌లో అమ్ముకుంటున్న మూఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి మూడు లక్షల రూపాయల నగదుతో పాటు దాదాపు 1.92 కోట్ల విలువైన 563 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన గారడి రామాంజీ అనే వ్యక్తి తన చదువు పూర్తి చేసుకోని హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. 1995లో ఫలక్‌నుమా డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ జీతం సరిపోకపోవడంతో 2005లో ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపర రంగంలోకి దిగాడు. కానీ అతనికి భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో అతని జన జీవనం చాలా కష్టంగా మారిపోయింది.

ఆ తర్వాత ఎలాగైన అధికంగా డబ్బులు సంపాదించాలని దొంగదార్లు తొక్కాడు. జేబు దొంగల నుంచి సెల్‌ఫోన్లను తక్కువ ధరలకే కొనుగోలు చేశాడు. ఆ తర్వాత వాటి హైదరాబాద్‌లో అమ్మేసి డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన జేబు దొంగలు పరిచయమయ్యారు. కొంతమంది కలిసి మూఠాగా ఏర్పడ్డారు. అయితే ఈ గ్యాంగ్ గత 15 నుంచి 17 సంవత్సరాలుగా సెల్‌ఫోన్లు కొట్టేస్తోంది. ఆ తర్వాత వాటిని ఐఎంఈఐ నంబర్లను మార్చి స్థానికంగా విక్రయిస్తోంది. ఈ ముఠాలోని ఆకాశ్, సన్నీ, వంశీల నుంచి రామాంజీ అండ్రాయిడ్ ఫోన్లను మాత్రమే కొంటాడు. దాదాపు 10 వేలు రూపాయలు ఉండే సెల్‌ఫోన్‌ను కేవలం 2 వేల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత వీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఆసిఫ్, అర్షద్‌ అనే మరో వ్యక్తులకు ఒక్కో ఫోన్ మీద 1000 కమీషన్‌తో అమ్మేస్తాడు. వీరు ముఖ్యంగా సికింద్రాబాద్, కొఠి ప్రాంతాల్లోని సెల్‌ఫోన్ రిపేరింగ్ సెంటర్లతో ఒప్పందం చేసుకుంటారు.

ఆ తర్వాత ప్రత్యేక సాఫ్ట్‌వేర్ల సహాయంతో ఫోన్ల లాక్‌లను, ఐఎంఈఐ నెంబర్లను మార్చేస్తారు. ఆ తర్వాత వీటిని నిరుద్యోగులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి తక్కువ ధరలకే అమ్మేస్తారు. ఒక్క సెల్‌పోన్ మీద వారికి దాదాపు 5 వేల నుంచి 7 వేల రూపాయల వరకు కమిషన్ వస్తుంది. అయితే ఈ ముఠా చేస్తున్న మోసాల గురించి మాదాపూర్ ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులకు సమాచారం అందింది. తాజాగా రామాంజీ ప్రయాణిస్తున్న కారును పట్టుకున్నారు. అందులో తనిఖీలు చేయదా 4 తెలుపు రంగు థర్మాకోల్, 3 బ్లాక్ కలర్ డబ్బాలను గుర్తించారు. వాటిని తెరిచి చూస్తే అందులో 563 వరకు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో విషయం ఏంటంటే రామాంజీ అరెస్టు ముందు కూడా దాదాపు 300 ఫోన్లు అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంతకుముందే రామాంజీ పలు కేసుల్లో కూడా జైలుకి వెళ్లి వచ్చాడు. అయినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
ఆ ఒక్క వెంట్రుక పీకితే జుట్టు అంతా తెల్లగా అవుతుందా?
ఆ ఒక్క వెంట్రుక పీకితే జుట్టు అంతా తెల్లగా అవుతుందా?
పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా?
పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా?
ఇంట్లో ఉపయోగించే ఆవ నూనె నిజమైనదా లేక నకిలీదా? ఇలా చెక్‌ చేయండి!
ఇంట్లో ఉపయోగించే ఆవ నూనె నిజమైనదా లేక నకిలీదా? ఇలా చెక్‌ చేయండి!
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
తెలుగు రాష్ట్రాల్లో JEE Advanced 2026 పరీక్ష కేంద్రాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో JEE Advanced 2026 పరీక్ష కేంద్రాలు ఇవే..
రాజా సాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టు లో ఎదురు దెబ్బ
రాజా సాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టు లో ఎదురు దెబ్బ
చలికాలంలో మార్నింగ్ వాక్ మానేయాలా?.. ఇది తెలియకుంటే నష్టపోతారు..
చలికాలంలో మార్నింగ్ వాక్ మానేయాలా?.. ఇది తెలియకుంటే నష్టపోతారు..
బైక్‌పై వెళ్లేటప్పుడు ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి.. వీడియో
బైక్‌పై వెళ్లేటప్పుడు ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి.. వీడియో
లోయలో పడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది మృతి!
లోయలో పడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది మృతి!