AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పందెం గిత్తలకు యమా క్రేజ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో దున్నపోతులతో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక పొట్టెళ్ల ప్రదర్శనలైతే చాలా కామన్. అదే మాదిరిగా ఎద్దుల పోటీలు, పందేలు మరీ కామన్ అని చెప్పుకోవాల్సిందే. వీటిలో రాణించే, ప్రత్యేక ఆకర్షణలో ఉండే జీవాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇప్పటికే చూశాం.. ఒక్క పొట్టేలు ధర రూ. 60 లక్షలు, దున్నపోతు ధర కోట్లకు పలికిందని మనం వింటూనే ఉన్నాం. అయితే, ఇదంతా మన తెలుగు రాష్ట్రాల అవతలి ముచ్చట్లు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం మన తెలంగాణ రాష్ట్రం..

Telangana: పందెం గిత్తలకు యమా క్రేజ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
1 Crore For Bulls
M Revan Reddy
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 10, 2023 | 3:28 PM

Share

సాధారణంగా కొన్ని రకాల పొట్టెళ్లు, దున్నలు, ఎద్దులు చాలా క్రేజ్ ఉంటుంది. కారణం వాటి బ్రీడ్, ఇతర ప్రత్యేకతలు. సదర్ ఉత్సవాల సమయంలో దున్నపోతులకు ఉండే క్రేజే వేరు. దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో దున్నపోతులతో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక పొట్టెళ్ల ప్రదర్శనలైతే చాలా కామన్. అదే మాదిరిగా ఎద్దుల పోటీలు, పందేలు మరీ కామన్ అని చెప్పుకోవాల్సిందే. వీటిలో రాణించే, ప్రత్యేక ఆకర్షణలో ఉండే జీవాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇప్పటికే చూశాం.. ఒక్క పొట్టేలు ధర రూ. 60 లక్షలు, దున్నపోతు ధర కోట్లకు పలికిందని మనం వింటూనే ఉన్నాం. అయితే, ఇదంతా మన తెలుగు రాష్ట్రాల అవతలి ముచ్చట్లు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం మన తెలంగాణ రాష్ట్రం ముచ్చట. అవును, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ గిత్తకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అది విక్రయానికి పెడితే ఏకంగా కళ్లు తిరిగే రేంజ్‌లో ధర పలికింది. దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఒంగోలు జాతి గిత్తలు అంటేనే రైతులకు యమా క్రేజ్.. అందులోనూ పందెం గిత్తలకు మరింత డిమాండ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పందెం గిత్తలకు కోటి రూపాయలు ధర పలికింది. వివరాల్లోకి వెళితే.. ఆయనో పోలీస్ ఆఫీసర్.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వృత్తి పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ ప్రవృత్తి మాత్రం జంతు ప్రేమికుడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి ఏఎస్పీగా హైదరాబాదులో పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సురేందర్ రెడ్డికి వ్యవసాయంతో పాటు గిత్తల పెంపకం, దేశ, విదేశాలకు చెందిన పక్షులు, కుక్కలు, కోళ్లు, పొట్టేళ్ల పెంపకం ఫ్యాషన్ గా మారింది. ఓవైపు పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు గిత్తల పెంపకాన్ని కొనసాగిస్తున్నాడు. హుజూర్ నగర్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఒంగోలు జాతికి చెందిన గిత్తలను పెంచుతున్నాడు. మేలు రకమైన ఒంగోలు జాతి గిత్తలను పందేల కోసం సిద్ధం చేశాడు. తాను పెంచుతున్న రెండు కోడెలకు భీముడు, అర్జునుడుగా పేరు పెట్టి ఆప్యాయంగా పిలుస్తుంటాడు.

పశు పెంపకంపై ఎంతో మక్కువ ఉన్న సురేందర్ రెడ్డి గిత్తలను పోటీలకు పంపేవాడు. తెలుగు రాష్ట్రాల్లో 9 నెలల్లో జరిగిన 40కి పైగా ఎద్దుల పోటీల్లో ఈ గిత్తలు పాల్గొన్నాయి. ఈ కొడెలు 34 సార్లు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. దీంతో ఈ గిత్తలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తాను పెంచుకున్న గిత్తల్లో ఈ జతను రూ.కోటి 10 లక్షల రూపాయలకు అమ్మారు. వీటిని ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతు సబ్జా సతీష్ కొనుగోలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనే గిత్తల అమ్మకాలు, కొనుగోళ్లలో ఇది రికార్డు స్థాయి ధర అని ఎసిపి సురేందర్ రెడ్డి చెబుతున్నారు. ఈ గిత్తలకు రికార్డు స్థాయి ధర రావడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తిగా భావించే ఒంగోలు జాతి గిత్తలకు డిమాండ్, క్రేజ్ పెరగడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..