- Telugu News Photo Gallery Open University in India IGNOU SMU Chandigarh University Online Course Know Details in Telugu
Open University: దేశంలోని టాప్ 5 దూరవిద్య విశ్వవిద్యాలయాలు.. ఉద్యోగం కూడా గ్యారెంటీ..!
చాలా మంది సమయం లేకనో, పరిస్థితులు బాగోలేకనో ఉన్నత చదువులు చదవలేకపోతుంటారు. అలాంటి వారి కోసం భారత ప్రభుత్వ దూర విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. పదవ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు దూర విద్యా విధానంలో చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఇక ఇంట్లోనే కూర్చుని ఉన్నత విద్యనభ్యసించడం అనేది చాలా మంది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దేశంలోని అనేక అగ్రశ్రేణి విశ్వ విద్యాలయాలు దూరవిద్య కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అలాంటి టాప్ 5 విశ్వవిద్యాలయాల పేర్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Aug 09, 2023 | 11:07 PM

నేటి కాలంలో దూర విద్యకు చాలా మంచి డిమాండ్ ఉంది. ఎవరైనా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకుంటే దూర విద్య ఉత్తమ ఎంపిక అని చెప్పొచ్చు. యూజీ, పీజీ కోర్సులే కాకుండా దూరవిద్యతో అనేక సర్టిఫికెట్లు, డిప్లొమా కోర్సులు చేయవచ్చు. దేశంలోని టాప్ 5 దూరవిద్య విశ్వవిద్యాలయాల గురించి తెలుసుకుందాం.

చండీగఢ్ విశ్వవిద్యాలయం: ఈ సంవత్సరం NIRF Ranking 2023లో 27వ ర్యాంక్‌ను పొందిన చండీగఢ్ విశ్వవిద్యాలయం దూరవిద్యకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి దూరవిద్యలో BBA, B.Com, MBA, M.Com, BA, MA కోర్సులు చేయవచ్చు.

ఇగ్నో: దూరవిద్య కోర్సుల విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో). ఇగ్నోలో అనేక డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లు అమలు చేయబడుతున్నాయి. ఇందులో అడ్మిషన్ తీసుకోవాలంటే ignouiop.samarth.edu.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం: NAAC- గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. ఇందులో అడ్మిషన్ తీసుకోవాలంటే osmania-ac-in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం: సిక్కిం ప్రభుత్వం, మణిపాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ద్వారా 1995లో స్థాపించబడిన సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం UGCచే గుర్తింపు పొందింది. ఇది దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇందులో అనేక డిటెన్షన్ కోర్సులు నిర్వహిస్తారు. ఇక్కడ నేరుగా అడ్మిషన్ తీసుకోవచ్చు.

సింబయాసిస్ యూనివర్సిటీ: సింబయాసిస్ యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ 2001లో స్థాపించబడింది. ఈ విశ్వవిద్యాలయంలో దూరవిద్య కోసం AICTE ఆమోదం తెలిపింది. సింబయాసిస్ యూనివర్సిటీకి దూరవిద్యను ఆమోదించింది. ఇక్కడి నుంచి వేలాది మంది విద్యార్థులు దూరవిద్యా కార్యక్రమం కింద ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.




