- Telugu News Photo Gallery Cinema photos Sai Pallavi Says About She loves eating Vibhudi telugu cinema news
Sai Pallavi: సాయి పల్లవికి ఉన్న వింత అలవాటు.. చిన్నప్పటి నుంచి ఏం తింటుందో తెలుసా..
తెలుగు సినీప్రియులకు ఫేవరేట్ హీరోయిన్ సాయి పల్లవి. తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ సంపాందించుకుంది. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ .. నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
Updated on: Aug 10, 2023 | 1:32 AM

తెలుగు సినీప్రియులకు ఫేవరేట్ హీరోయిన్ సాయి పల్లవి. తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ సంపాందించుకుంది.

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ .. నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

గ్లామర్ దూరంగా ఉంటూ.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకున్న వింత అలవాటు గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు విభూది తినే అలవాటు ఉందని తెలిపింది. విభూది తినడం చాలా ఇష్టమట.

ఇప్పటికీ తాను ఏదైనా ప్రదేశం వెళ్తే బ్యాగులో విభూది పెట్టుకుని వెళ్తానని.. విభూది తినడం మర్చిపోలేని అలవాటు. మంచి చెట్టు నుంచి తయారు చేసిన విభూది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆమె తెలిపింది.




