కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. తెలుగులో ఈ అమ్మడు ఇప్పుడు సెన్సేషన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

27 May 2026

 సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల చిన్ననాటి అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలోకి వస్తే చాలు.. నెటిజన్లు వాటిని తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో చక్కర్లు కొడుతుంది. 

తమ అభిమాన నటీమణులు చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోవడానికి సినీ ప్రియులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం వైరలవుతున్న ఆ చిన్నారి ఫోటో మరెవరిదో కాదు శివానీ నాగారం. 

రెండు జడలు వేసుకుని, లంగా ఓణీలో సాంప్రదాయబద్ధంగా ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఆ అమ్మాయి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో కుర్రకారు మనసులు దోచుకుంటున్న క్రేజీ హీరోయిన్.

శివాని నగరం అనగానే ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ అండ్ ఎనర్జిటిక్ వైబ్ గుర్తొస్తుంది. క్లాసికల్ డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

'లిటిల్ హార్ట్స్' సినిమా ద్వారా ఈమె హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటన, హోమ్లీ లుక్స్ , క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కూడా ఈమెకు సినీ విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అటు సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రేర్ ఫోటో శివాని స్కూల్ రోజుల్లో ఒక క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ కోసం రెడీ అయినప్పటిది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఎంతో హుందాగా కనిపిస్తుంది. 

శివాని రూపం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "చిన్నప్పటి నుండి శివాని ఫేస్‌లో అదే క్యూట్‌నెస్, అమాయకత్వం ఉన్నాయి" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.