TS Eamcet 2023 Counselling: ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తి.. ఆగస్టు 17 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్
ఇంజినీరింగ్ కాలేజీల్లో తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తుది విడత కౌన్సెలింగ్‌లో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో మొత్తం 70,627 సీట్లను భర్తీ చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ బుధవారం (ఆగస్టు 9) ప్రకటించింది. చివరి విడత కౌన్సెలింగ్ పూర్తవ్వడంతో కన్వీనర్ కోటాలో దాదాపు 13,139 సీట్లు మిగిలిపోయాయని ఉన్నత వెల్లడించింది. చివరి విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ లోపు సీటు పొందిన కాలేజీల్లో చేరాలని సూచించింది. ఇక కన్వీనర్ కోటాలో మిగిలిన ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు..

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తుది విడత కౌన్సెలింగ్‌లో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో మొత్తం 70,627 సీట్లను భర్తీ చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ బుధవారం (ఆగస్టు 9) ప్రకటించింది. చివరి విడత కౌన్సెలింగ్ పూర్తవ్వడంతో కన్వీనర్ కోటాలో దాదాపు 13,139 సీట్లు మిగిలిపోయాయని ఉన్నత వెల్లడించింది. చివరి విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ లోపు సీటు పొందిన కాలేజీల్లో చేరాలని సూచించింది. ఇక కన్వీనర్ కోటాలో మిగిలిన ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ వాకాటి కరుణ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా గత నెలలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 17న స్లాట్ బుకింగ్, 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించారు. ఆగస్టు 17 నుంచి 19 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి ఆగస్టు 23న సీట్లు కేటాయిస్తామన్నారు. స్పాట్ అడ్మిషన్ల కోసం అదే రోజున గైడ్‌లైన్స్ కూడా విడుదల చేయనున్నట్లు వాకాటి కరుణ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్ధులు అలాట్ చేసిన కాలేజీల్లో రిపోర్ట్ చేయకుంటే సీటు రద్దు అవుతుందని తెలిపారు.
మరోవైపు జోసా కౌన్సెలింగ్‌లో ఎన్‌ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తవడంతో ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. స్పెషల్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక సీట్లు పొందినవారు ఆగస్టు 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేయాలని కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
