Telangana: హైకోర్టుకు చేరిన గ్రూప్ 2 వివాదం.. అప్పుడే విచారణ
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు టీఎస్పీఎస్సీ ఎదుట అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే గ్రూప్ 2 పరీక్షను రెండు నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు గ్రూప్ 2 వాయిదా కోరుతూ టీఎస్పిఎస్సీ కార్యాలయం బయట వేల సంఖ్యలో అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అభ్యర్థులను చదరగొట్టేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది.. టీఎస్పీఎస్సీ బయట ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది.

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు టీఎస్పీఎస్సీ ఎదుట అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే గ్రూప్ 2 పరీక్షను రెండు నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు గ్రూప్ 2 వాయిదా కోరుతూ టీఎస్పిఎస్సీ కార్యాలయం బయట వేల సంఖ్యలో అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అభ్యర్థులను చదరగొట్టేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది.. టీఎస్పీఎస్సీ బయట ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. ఇదే తరుణంలో గ్రూప్ 2 పరీక్షకు అప్లై చేసిన 150 మంది అభ్యర్థులు కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గ్రూప్ 2 పరీక్షల రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఇప్పటికే రెండుసార్లు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. జూన్ 26 తో పాటు జూలై 24 తేదీలలో చైర్మన్ ను కలిసి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. టీఎస్పీఎస్సీ నుండి ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో టీఎస్పిఎస్సి ముందు ఆందోళన నిర్వహించారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి లేకపోవడంతో టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనిత రామచంద్రన్ కు వినతిపత్రం అందజేశారు అభ్యర్థులు.. వినతి పత్రం అందుకున్న సెక్రెటరీ, వాయిదా గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని.. ఆలోచిస్తామని అభ్యర్థులకు చెప్పారు
రేపు హై కోర్ట్ లో గ్రూప్ 2 పరీక్ష పై విచారణ




150 మంది అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. గురుకులాల టీచర్ ఎగ్జామ్ తోపాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ పరీక్షలు నేపథ్యంలో గ్రూప్-2 ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వ్యవహార శైలిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఒకవైపు పేపర్ లీకేజీ గోల మరోవైపు గందరగోల షెడ్యూల్ తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 7 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తుందని సంబరపడాలా లేక టీఎస్పీఎస్సీ గందరగోల షెడ్యూల్ ఇస్తున్నందుకు బాధపడాల అనేది అర్థం కావడం లేదు అంటున్నారు అభ్యర్థులు..హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై రేపు వాదనలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల గ్రూప్ -1 పరీక్ష పేపర్ లీకవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు గ్రూప్ – 2 వివాదం రావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
