AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: ఇంట్లో నిద్రపోయిన వ్యక్తిపై విష సర్పాన్ని విసిరిన యువకుడు.. కారణం తెలిస్తే బట్టలూడదీసి కొడతారు..!

ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి తండ్రి.. ఆ యువకుడిని మందలించాడు. అమ్మాయి జోలికి వస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్‌తో పగ పెంచుకున్న యువకుడు.. అమ్మాయి తండ్రిని ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం ప్లాన్స్ కూడా వేశాడు. అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన యువకుడు.. భయంకరమైన ప్లాన్ వేశాడు. రాత్రివేళ అందరూ పడుకున్న తరువాత అమ్మాయి ఇంటికి వచ్చిన యువకుడు.. ఆమె తండ్రి నిద్రిస్తున్న గది వద్దకు వెళ్లాడు. అతను గాఢ నిద్రలో ఉండగా.. విషపూరితమైన సర్పాన్ని అతనిపై విసిరాడు యువకుడు. అయితే, పాము స్పర్శకు ఒక్కసారిగా లేచిన అమ్మాయి తండ్రి.. ఆ పామును చూసి హడలిపోయాడు.

Kerala: ఇంట్లో నిద్రపోయిన వ్యక్తిపై విష సర్పాన్ని విసిరిన యువకుడు.. కారణం తెలిస్తే బట్టలూడదీసి కొడతారు..!
Snake
Shiva Prajapati
|

Updated on: Aug 10, 2023 | 9:16 AM

Share

Kerala: కేరళలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు.. ఓ యువతి తండ్రిపై అత్యంత ప్రమాదకరమైన విష సర్పాన్ని విసిరాడు. అయితే, ఆ వ్యక్తి అదృష్టం బాగుండి.. ప్రాణాలతో బటయపడ్డాడు. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి ఈ ఆ యువకుడు ఎందకు పాము విసిరాడు.. ఎందుకు చంపాలనుకున్నాడు.. ఆ వ్యక్తిపై ఎందుకంత కోపం వచ్చింది.. మ్యాటర్ తెలిస్తే యువకుడిని పొట్టు పొట్టు కొట్టాలని అనుకుంటున్నారు. మరి ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కేరళలలోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు(30).. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమెను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే అతని వేధింపులు మరీ ఎక్కువ అవడంతో విషయాన్ని ఇంట్లో చెప్పింది యువతి. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి తండ్రి.. ఆ యువకుడిని మందలించాడు. అమ్మాయి జోలికి వస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్‌తో పగ పెంచుకున్న యువకుడు.. అమ్మాయి తండ్రిని ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం ప్లాన్స్ కూడా వేశాడు. అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన యువకుడు.. భయంకరమైన ప్లాన్ వేశాడు. రాత్రివేళ అందరూ పడుకున్న తరువాత అమ్మాయి ఇంటికి వచ్చిన యువకుడు.. ఆమె తండ్రి నిద్రిస్తున్న గది వద్దకు వెళ్లాడు. అతను గాఢ నిద్రలో ఉండగా.. విషపూరితమైన సర్పాన్ని అతనిపై విసిరాడు యువకుడు. అయితే, పాము స్పర్శకు ఒక్కసారిగా లేచిన అమ్మాయి తండ్రి.. ఆ పామును చూసి హడలిపోయాడు. ఆ పక్కనే పామును విసిరిన యువకుడిని చూసి నిర్ఘాంతపోయాడు.

ఈ విషయంపై కట్టకర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు యువతి తండ్రి. ప్రేమ పేరుతో తన కూతురుని వేధిస్తున్నాడని, ఇదే విషయంలో వార్నింగ్ ఇచ్చినందుక తనను చంపేందుకు కుట్ర చేశాడని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తనను చంపడానికి కిటికీలోంచి పామును విసిరాడని ఫిర్యాదు చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. పామును విసిరిన యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై హత్యాయత్నం నెపంతో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా.. నిందితుడు కిచ్చు(30)గా గుర్తించిన పోలీసులు అతనిపై ఇదివరకే చాలా కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రేమను తిరస్కరించిందంనే కారణంగానే కిచ్చు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
ఇంట్లో డమరుకం ఉంచుతున్నారా? ఈ ఒక్క దిశలో పెడితే ప్రతికూల శక్తి..
ఇంట్లో డమరుకం ఉంచుతున్నారా? ఈ ఒక్క దిశలో పెడితే ప్రతికూల శక్తి..
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో