AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee Price: మీరు కాఫీ ప్రియులా.? అయితే మీకు ఓ బ్యాడ్‌ న్యూస్‌..

ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే రోజు మొదలు కానీ వారు మనలో చాలా మందే ఉంటారు. అలాంటి వారికి ఇదొక చేదు వార్త. కాఫీ సిప్ ఇప్పుడు కాస్ట్ లీ.. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి.. ఇప్పుడు అదే బాటలో వెళ్తుతోంది కాఫీ కూడా.. టమాటా ధర పెరిగితే అవి లేకుండానే వంటకాలు వండుకున్నాం. కానీ కాఫీ లేకుండా ఉండలేని పరిస్థితి. అలాంటి గింజల కొరత ప్రపంచవ్యాప్తంగా వేధిస్తోంది. కొరత కారణంగా కాఫీ ధర పెరుగుతుందని, ఈ పెరుగుదల మరింత పెరగనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి...

Coffee Price: మీరు కాఫీ ప్రియులా.? అయితే మీకు ఓ బ్యాడ్‌ న్యూస్‌..
Coffe Prices
Narender Vaitla
|

Updated on: Aug 10, 2023 | 9:01 AM

Share

ప్రస్తుతం మార్కెట్లో ఏ వస్తువును ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేట్లు అనేలా పరిస్థితి మారిపోయాయి. టమాట ధరలు సామాన్యులను షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. కిలో టమాట ధర రూ. 300కి చేరుతుందని ఎప్పుడు ఊహించలేదు. ఇక టమాట దారిలో నేను అంటూ ఉల్లి కూడా దూసుకొస్తోంది. వచ్చే నెలలో ఉల్లి ధరలు భారీగా పెరగనున్నాయని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పాయి. దీంతో సామాన్యులు మార్కెట్‌కు వెళితే జేబులకు చిల్లు పడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నేను కూడా తక్కువేం కాదన్నట్లు కాఫీ కూడా సిద్ధమవుతుంది. అవును కాఫీ ధరలు కూడా పెరగనున్నాయి.

ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే రోజు మొదలు కానీ వారు మనలో చాలా మందే ఉంటారు. అలాంటి వారికి ఇదొక చేదు వార్త. కాఫీ సిప్ ఇప్పుడు కాస్ట్ లీ.. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి.. ఇప్పుడు అదే బాటలో వెళ్తుతోంది కాఫీ కూడా.. టమాటా ధర పెరిగితే అవి లేకుండానే వంటకాలు వండుకున్నాం. కానీ కాఫీ లేకుండా ఉండలేని పరిస్థితి. అలాంటి గింజల కొరత ప్రపంచవ్యాప్తంగా వేధిస్తోంది. కొరత కారణంగా కాఫీ ధర పెరుగుతుందని, ఈ పెరుగుదల మరింత పెరగనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాఫీ ధరల పెరుగుదల ఏదో ఒక్క దేశానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ధరల ప్రభావాన్ని ఎదుర్కోనున్నాయి.

బ్రెజిల్, వియత్నాంలో కాఫీ గింజల కొరత. ఇండియాలో కురిసిన అకాల వర్షాలతో కాఫీ పంట దెబ్బతిని, గింజల దిగుబడి తగ్గిపోయింది. వాస్తవానికి కాఫీ గింజలకు ఎప్పుడూ డిమాండ్ అధికంగానే ఉంటుంది. ఆ మేరకు సప్లై కూడా ఉంటుంది. అయితే తాజాగా దిగుబడి తగ్గుతుండడంతో ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.  సాధారణంగా కిలో కాఫీ గింజలు రూ.580 కాగా ప్రస్తుతం రూ.650 వరకు పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కిలో కాఫీ గింజలపై ప్రస్తుతం కనీసం రూ.50 పెరిగింది. కాఫీ రోబస్టా గింజలు 50 శాతం ధర పెరగింది. అలాగే అరబికా కాఫీ గింజలు 15 శాతం మేర పెరిగాయి. గతేడాది 200 గ్రాముల జార్ ధర రూ.280 ఉండగా, ఇప్పుడు రూ. 360కి పెరిగింది. వచ్చే రోజుల్లో కాఫీ గింజల ధరలు 10 శాతం పెరుగుతాయని సీసీఎల్ ప్రొడక్ట్ సంస్థ అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..