AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిట్టి తల్లికి ఎంత కష్టమొచ్చింది.! ఆపన్న హస్తం కోసం అమ్మనాన్నల ఎదురుచూపులు..

ఆరోగ్య శ్రీ లో కూడా వైద్య చికిత్సకి అవకాశం లేదు . ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. తాము పేదరికం తో బాధ పడుతున్నామని, చికిత్స చేయించే స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపకు ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు..

ఈ చిట్టి తల్లికి ఎంత కష్టమొచ్చింది.! ఆపన్న హస్తం కోసం అమ్మనాన్నల ఎదురుచూపులు..
Rare Disease
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 11, 2024 | 1:57 PM

Share

పాపకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోయే ఆ తల్లిదండ్రులు బిడ్డకు చర్మంపై దద్దుర్లు లా రావడంతో చికిత్స కోసం వైద్యులను సంప్రదించారు…అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్లు ఇది అరుదైన వ్యాధి అని తేల్చడంతో కన్న పేగు తల్లడిల్లిపోతుంది. పాప బతకాలంటే బోన్ మారో మార్పిడి తప్ప వేరే మార్గం లేదనడంతో కన్నవారి గుండె ఆగినంత పనైంది. ఓ వైపు చావుబతుకుల్లో చిన్నారి ప్రాణం, ఇంకోవైపు రూ.50 లక్షలు ఎవర్ని అడగాలి.. ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో విలపిస్తున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు.

బుడి బుడి అడుగులతో అల్లరి చేయాల్సిన ఆ చిన్నారికి అరుదైన వ్యాధి బారిన పడింది. పాపపై పంచ ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పాపను కాపాడుకునేందుకు లక్షల్లో ఖర్చవుతుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. వ్యాధి చికిత్స కోసం గత నాలుగేళ్లుగా తిరగని ఆసుపత్రి లేదు. తోటి పిల్లల్లా తన పాప సంతోషంగా గడపాలని ఉన్నదంతా అమ్మినా వైద్యానికి సరిపోదని అవేదన చెందుతున్నారు. వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకునే తమ కుటుంబానికి ఇప్పుడు పాప సంరక్షణ భారంగా మారిందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజెర్ల గ్రామానికి చెందిన శ్రీరామ్ సంతోష్, రమ్యశ్రీ దంపతులకు ఒక కొడుకు, కూతురు. కూతురు దియా కు 4 సంవత్సరాల వయసు. కాగా పుట్టిన 11 నెలల వయసులోనే అరుదైన S L E అనే వ్యాధి బారిన పడిందని వైద్యులు నిర్ధారించారు. మొదట్లో కాలి బొటన వేలిపై చిన్న చిన్న రాసెస్ రావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువెళ్లారు. వైద్యులు న్యూట్రిషన్ ప్రాబ్లం అని చెప్పారు.. మందులు వాడినప్పటికి పాప కోలోకోలేదు..

ఇవి కూడా చదవండి

క్రమంగా రాషస్ తీవ్రత పెరిగి మొఖంపై, నోటిలో సైతం రావడం, రక్తం కారడంతో పాటు దుర్వాసన కూడా వచ్చేదని, మందులకు తగ్గక పోవడంతో రాషేస్ తీవ్రత శరీరానికి మొత్తం పాకిందని పాప తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

డాక్టర్ల సలహాతో చికిత్స కోసం హైదారాబాద్లోని ప్రముఖ హాస్పిటల్ కి వెళ్తే… అక్కడ బయాప్సీ టెస్ట్ కోసం నేషనల్ ల్యాబ్ కి పంపించారు. రిపోర్టులో అరుదైన వ్యాధిగా గుర్తించారు దేశంలోనే ఇది మొదటి కేసుగా గుర్తించారని తల్లిదండ్రులు అంటున్నారు . ప్రస్తుతానికి పాపకు ప్లాస్మా ను అవసరానికి ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించే అవకాశం కావడం, ఖర్చుతో కూడుకున్నది కావడంతో తనకున్న భూమిని అమ్మినా తన చిన్నారి వైద్యానికి సరిపోదని అవేదన చెందుతున్నారు.

ఆరోగ్య శ్రీ లో కూడా వైద్య చికిత్సకి అవకాశం లేదు . ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. తాము పేదరికం తో బాధ పడుతున్నామని, చికిత్స చేయించే స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపకు ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..