Variety Punishment: మందుబాబులూ.. జర ఇది సూడుర్రి.! డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే..?
మందుబాబులకు మంచిర్యాల జిల్లా కోర్టు ఎవరూ ఊహించని శిక్ష విధించింది. ఇటీవల కాలంలో డ్రంకెన్ డ్రైవ్‌లో చాలామంది పట్టుబడుతున్నారు. ఇందులో మైనర్లు కూడా ఉంటున్నారు. అయితే, వీరికి జరిమానా విధించడం, జైళ్ళలో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అందుకే మంచిర్యాల జిల్లా న్యాయస్థానం వారికి ఊహించని శిక్ష వేసింది.
పీకల దాకా ఫుల్లుగా మద్యం తాగిన మందుబాబులకు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా మంచిర్యాల జిల్లా కోర్టు శిక్షను ఖరారు చేసింది. మంచిర్యాల మాతా శిశు ఆస్పత్రిని క్లీన్ చేయాలని కోర్టు ఆదేశించింది. మంచిర్యాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 27 మంది మందు బాబులు వారం రోజులపాటు మాతా శిశు ఆసుపత్రిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి ఉపనిషద్విని. కోర్టు ఆదేశాల మేరకు మందుబాబులను ఆసుపత్రికి తరలించారు ట్రాఫిక్ పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos