NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం రూపంలో మార్పులు.. తారక్ చేతులమీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు..

ప్రైవేట్ స్థలం లోకి మార్చి..విగ్రహ రూపంలోనూ మార్పులు చేశారు. అక్కడ నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ఆవిష్కరణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వివాదం లేకుండా ఉంటే..మే 28 న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించే వారు..వివాదం నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడింది.

NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం రూపంలో మార్పులు.. తారక్ చేతులమీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు..
Ntr Statue Khammam
Follow us
N Narayana Rao

| Edited By: Surya Kala

Updated on: Jul 18, 2023 | 2:39 PM

ఖమ్మం లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే..శ్రీ కృష్ణుడు రూపం లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ను హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం తెలుపుతూ..హై కోర్టు కు వెళ్ళాయి.. హై కోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం స్థలం అయిన లకారం ట్యాంక్ బండ్ మధ్యలో ఏర్పాటు చేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు నిర్వాహకులు.. లకారం పక్కనే కోటి రూపాయలతో ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి..విగ్రహ ప్రతిష్ఠ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఎన్టీఆర్ విగ్రహం రూపంలో మార్పులు చేశారు.. పిల్లన గ్రోవి, నెమలి పింఛం తొలగించి.. చేతిలో ఖడ్గం ఏర్పాటు చేశారు.

ప్రైవేట్ స్థలం లోకి మార్చి..విగ్రహ రూపంలోనూ మార్పులు చేశారు. అక్కడ నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ఆవిష్కరణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వివాదం లేకుండా ఉంటే..మే 28 న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించే వారు..వివాదం నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడింది.

ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలనీ నిర్వాహకులు నిర్ణయించారు. మంత్రి పువ్వాడ అజయ్..జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతున్నారు..అతను ఇచ్చే సమయాన్ని బట్టి త్వరలోనే గ్రాండ్ గా ఈ కార్యక్రమం నిర్వహించాలని యోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..