Minister Kishan Reddy: మీ స్టేషన్లలో ఇక ఆ రైళ్లు ఆగుతాయి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తిని ఓకే చేసిన రైల్వే మంత్రి

సూదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ కొనసాగుతున్న డిమాండ్‌కు బ్రేకులు వేసింది.

Minister Kishan Reddy: మీ స్టేషన్లలో ఇక ఆ రైళ్లు ఆగుతాయి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తిని ఓకే చేసిన రైల్వే మంత్రి
Kishan Reddy
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 18, 2023 | 4:23 PM

తెలుగు రాష్ట్రాలవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సూదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ కొనసాగుతున్న డిమాండ్‌కు బ్రేకులు వేసింది. దీర్ఘకాలంగా తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న డిమాండ్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన సూచనకు రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. తనకు వచ్చిన డిమాండ్లను రైల్వేమంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కలిసి వివరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఆయా స్టేషన్లలో ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రయాణికులకు కలిగే సౌకర్యం గురించి వివరించారు. ఈ అంశంపై అధికారులతో మాట్లాడిన రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్.. గ్రీన్ సిగల్ ఇచ్చారు.

తాజాగా ఈ డిమాండ్లకు అంగీకరిస్తూ.. ఆయా రైల్వేస్టేషన్లలో వివిధ ప్రధానమైన రైళ్లను ఆపనున్నట్లుగా  ప్రకటించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పలు స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణలో బెల్లంపల్లి, సిర్పూర్-కాగజ్‌నగర్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, గద్వాల్ రైల్వే స్టేషన్లలో సూదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లు ఇక ముందు ఆగనున్నాయి.

ఆంధ్రపదేశ్‌లో.. పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం